ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ రాజకీయంగా వేడెక్కింది. నియోజకవర్గంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. సీఎం నుంచి మంత్రులంతా ఇక్కడ తిష్ట వేసి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు బర్త్ రఫ్ కాబడ్డ ఈటల రాజేందర్ తన ప్రాబల్యం చాటుకోవడానికి ఊరూరా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మరి కొన్ని పార్టీలు కూడా ఇక్కడ సందడి చేస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే సాగుతోంది. కానీ మరికొన్ని పార్టీలు కూడా హూజూరాబాద్లో పోటీ చేయనున్నాయా..?
ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ రెండు సార్లు పర్యటించారు. ప్రభుత్వ పథకాలపై సమీక్షలు చేస్తూ వాటి అమలుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన దళిత బంధు పథకం సక్సెస్ కోసం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా సర్వే కూడా ప్రారంభించారు. దళిత బంధు పథకంలో ఇప్పటికే ఎంపికైన 15 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేశారు. మరికొంత మందికి అందించేందుకు సమాయత్తమవుతున్నారు.
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే రూ.2వేల కోట్లను దళిత బంధు కోసం విడుదల చేశారు. ఈ నిధుల ద్వారా కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన దళితులకు యూనిట్లను అందజేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఈ పథకం అమలుపై పర్యవేక్షించనున్నారు. మరోవైపు గొర్రెల పంపకం, ఆసరా పింఛన్ల పంపిణీ తదితర పథకాలను అర్హులకు అందజేస్తున్నారు. కార్యకర్త నుంచి మంత్రుల వరకు ఇక్కడ పర్యటించి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇక ఈటల రాజేందర్ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తన రాజీనామాతోనే సీఎంలో కదలిక వచ్చిందని, తనను గెలిపిస్తే సీఎం భూమ్మీద నిలుచుంటాడని అంటున్నారు. దళిత బంధు పథకం కూడా తన వల్లే ప్రవేశపెట్టాడని, అయితే రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అంటున్నారు. బీజేపీలో చేరిన ఈటల పాదయాత్రకు ఆ పార్టీ నాయకులు కలిసి వస్తున్నారు. ఇక నేటి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి హుజూరాబాద్ వరకు నడవనున్నారు.
ఇదిలా ఉంటే గత నెలలో వైఎస్ఆర్సీపీతెలంగాణ పార్టీ స్థాపించిన షర్మల కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటనే అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు సిరిసేడు గ్రామానికి వచ్చారు. అయితే కొందరు ఇక్కడ పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు షర్మిల ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. ఎవరైనా నిరుద్యోగి నిలబడితే తాము మద్దతు ఇస్తామన్నారు. కానీ పార్టీలోని నాయకుల సూచన మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులందరితో ఇక్కడ నామినేషన్లు వేయిస్తామంటున్నారు. మరి ఎన్నిక జరిగే సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మరోవైపు బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ మొదట్లో ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను ఆయన ఖండించారు. ఆ తరువాత బీఎస్పీలో చేరిన తరువాత హుజూరాబాద్లో బీఎస్పీ పోటీ చేయాలని అంతర్గతంగా ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. పార్టీ కోఆర్టినేటర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ కు సీనియర్ నేతలు ఇక్కడ అభ్యర్థిని దింపాలని సూచిస్తున్నారట. బహుజనులే లక్ష్యంగా పార్టీ వ్యవహారాలు ఉన్న నేపథ్యంలో దళితులు ఎక్కువగా ఉన్న హూజూరాబాద్లో పోటీ చస్తే ప్రభావం ఉండే అవకాశం ఉంటుదని అంటున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?