ఎన్నో తర్జన భర్జనలు, దరఖాస్తులు, నేతల అభిప్రాయాల తర్వాత హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఖరారైంది. ఇప్పటికే హుజూరాబాద్ లో పోటీచేయడానికి ఆసక్తి ఉన్న వారినుంచి కాంగ్రెస్ అధిష్టానం దరఖాస్తులు ఆహ్వానించింది. అనంతరం కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్లను సంప్రదించింది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉండడంతో ఇక ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
టీపీసీసీ చీఫ్ గా నియామకమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో దీన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా కసరత్తు చేశారు. ఎట్టకేలకు హుజూరాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
ఏఐసీసీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్ తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా భేటి అయ్యారు. కొండా సురేఖ పోటీకి నిరాకరించడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెరపైకి యువకుడు , ఉత్సాహ వంతుడైన ఎన్ఎస్.యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. వెంకట్ పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.