అనుకోని పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్థి కూడా ఎప్పుడో ఫైనల్ అయ్యారు. కానీ.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తేల్లేదు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటం.. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థికి సీఎం కేసీఆర్ స్వయంగా బీ ఫారమ్ ఇచ్చి.. వెన్ను తట్టటమే కాదు..ఖర్చుల కోసం పార్టీ చెక్కు ఇచ్చిన వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. శనివారం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఫైనల్ చేసింది.
టీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ సైతం విద్యార్థి నాయకుడ్నే పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగరావు అలియాస్ వెంకట్ పేరును డిసైడ్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడైంది. అయితే.. శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని భావించారు.
ఇదిలా ఉంటే.. అనూహ్యంగా శనివారం ఉదయం నుంచి మొదలైన నిరుద్యోగ జంగ్ ఆందోళ తీవ్రస్థాయిలో జరిగింది. కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. పోలీసులు అడ్డుకుంటున్నా వెనుకడుగు వేయకుండా ఆందోళ చేపట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ సైతం నిరుద్యోగ జంగ్ లో కీలకంగా వ్యవహరించారు. అనుకోని రీతిలో పోలీసుల లాఠీల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చిన నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి.. కాంగ్రెస్ జెండా పెట్టాలన్న ప్రయత్నం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. చివరకు సాయంత్రం వేళలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల మేయగలిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. లాఠీలు ఝుళిపించటంతో హుజూరాబాద్ అభ్యర్థిగా ఎంపికైన వెంకట్ తీవ్రగాయాలయ్యాయి.
దీంతో ఆయన అపస్మారక పరిస్థితికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను కొత్తపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని ట్విటర్ ద్వారా ఆయన అభిమానులకు.. నేతలకు తెలియజేశారు. ప్రస్తుత పెద్దపల్లి జిల్లాకు చెందిన వెంకట్ విద్యార్థి నేతగా ఉత్సాహంగా పని చేస్తారన్న పేరుంది. వాస్తవానికి కొండా సురేఖ పోటీ చేస్తారని చెప్పినా.. ఆమె విధించిన షరతులతో అధినాయకత్వం వెనక్కి తగ్గినట్లు చెబుతారు. ఇలాంటివేళ ఎంపిక చేసిన వెంకట్ లాఠీ దెబ్బలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వైనం సంచలనంగా మారింది.