హుజూరాబాద్ ఎన్నికలు... సీబీఎన్‌కి ఇబ్బంది ఇదేనా?

Update: 2021-07-02 08:42 GMT
ఎంపి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చింద‌న్న‌ట్టుగా ఉందట‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రిస్థితి. అధికారంలో ఇప్పుడు ఆయ‌న లేక‌పోయినా.. ఉన్న‌ట్టుగానే ఫీల‌వుతూ.... నిత్యం ఆయ‌న త‌న పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మాలోచ‌ల‌ను జ‌రుపుతున్నారు. సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ ఆయ‌న హైద‌రాబాద్‌లో కూర్చుని జూమ్ యాప్ ద్వారా.. గంట‌ల కొద్దీ మాట్లాడ‌డం.. పార్టీ శ్రేణుల‌ను క‌ద‌ల‌నీయ‌కుండా కూర్చోబెట్టి.. క్లాసులు ఇవ్వ‌డం వంటివి తెలిసిందే.

అయితే.. చంద్ర‌బాబు ఏం చేసినా.. ప్ర‌చారం క‌ల్పించేందుకు ఆయ‌న అనుకూల మీడియా సిద్ధంగా ఉన్న విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు ప్ర‌సంగానికి స‌ద‌రు ఛానెళ్లు భారీ ఎత్తున ఫోక‌స్ చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు కొన్ని నెల‌ల పాటు.. అంటే.. తెలంగాణ‌లోని హుజూరాబాద్ స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు వార్త‌ల‌కు, ఆయ‌న జూమ్ ప్ర‌సంగాల‌కు, ప్ర‌త్య‌క్ష కార్య‌క్ర‌మాల‌కు స‌ద‌రు చానెళ్లు ప్రాధాన్యం త‌గ్గించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. చంద్ర‌బాబు ప్ర‌సంగాల‌క‌న్నా కూడా ఈ చానెళ్ల‌కు హుజూరాబాద్ ఉప పోరు.. దీనికి అనుసంధానంగా ఉన్న స‌మస్య‌ల‌తో.. టీఆర్ పీ రేటింగ్ పెరుగుతుంది.

ఈ నేప‌థ్యానికి తోడు.. హుజూరాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య కూడా జ‌ల వివాదాలు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ విష‌యంలో కేసీఆర్ వెన‌క్కి త‌గ్గేదే లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి నూరు శాతం.. విద్యుత్తును ఉత్ప‌త్తి చేయాల్సిందేన‌ని ఆదేశించ‌డం.. ఆ వెంట‌నే అధికారులు రంగంలోకి దిగ‌డం, ప్రాజెక్టుల భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించ‌డం.. వంటివి ఎప్పుడు ఏం జ‌రుగుతుందోననే ఉత్కంఠ‌కు దారితీసిన నేప‌థ్యంలోమీడియా ఫోక‌స్ అంతా.. కూడా దీనిపై నే ఉంది.

ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఆయ‌న మోడీకి, జ‌ల‌శ‌క్తి మంత్రికి కూడా ఉత్త‌రాలు రాశారు. ఈ క్ర‌మంలో ఇరు రాష్ట్రాల మీడియా మొత్తంగా.. ఈ విష‌యంపైనే కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌నుంది. దీంతో .. చంద్ర‌బాబు నిర్వ‌హించే జూమ్ మీటింగుల‌కు, ప్ర‌చారాల‌కు ప్రాధాన్యం పూర్తిగా త‌గ్గిపోయే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. హుజూరాబాద్ ఉప పోరు.. చంద్ర‌బాబుకు ఇలా ఇబ్బంది అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News