అదేం సిత్రమో కానీ.. దేశంలో మరెక్కడా లేని విధంగా కామ వ్యవహారాలు కర్ణాటకలో తరచూ వెలుగులోకి వస్తుంటాయి. ఓపక్క అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతుంటే.. ఆ హాట్ ఏ మాత్రం పట్టించుకోని పలువురు ప్రజాప్రతినిధులు.. మొబైల్ లో హాట్ వీడియోలు చూస్తూ దొరికిపోవటం.. పదవి మీదకు తెచ్చుకోవటం చేశాం. ఇలాంటి ఉదంతాలు కర్ణాటకలో ఎక్కువగా వెలుగు చూస్తుంటాయి. తాజాగా.. కర్ణాటక రాష్ట్ర మంత్రి హెచ్ వై మేటి రాసలీలలు కెమేరా కన్నుకు చిక్కటమే కాదు.. అవి కాస్తా అక్కడి ఒక వార్తా ఛానల్ లో ప్రసారం కావటంతో.. అయ్యగారి భాగోతం బయటకు వచ్చేసింది.
సాయం కోరి వచ్చిన ఒక మహిళను.. తాను చేసే సాయానికి ప్రతిఫలం ఇవ్వాలని కోరటమే కాదు.. ఆమెతో చేసిన కామకేళి అయ్యగారికి నెత్తికి చుట్టుకుంది. చేసిన పాపం ఊరకే పోనట్లు.. మంత్రి రాసలీలల్ని.. గుట్టుగా కెమేరాతో షూట్ చేసేసి.. వాటిని ఒక మీడియా ఛానల్ కు అప్పగించటం.. వారు వాటిని ప్రసారం చేయటంతో ఉన్న పదవి పోయింది. కర్ణాటకతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
కర్ణాటక ఎక్సైజ్ శాఖామంత్రి హెచ్ వై మేటి కక్కుర్తి పడ్డారు. తన శాఖకు చెందిన ఒక మహిళా ఉద్యోగి.. తనకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీ చేయాలంటూ ఆయన వద్దకు వచ్చారు. మంత్రికి బంధువైన సదరు మహిళను.. ఆయన వదిలిపెట్టలేదు. నీకు కావాల్సింది నీకిస్తా.. నాకు కావాల్సింది నాకివ్వవా? బేరం పెట్టటమే కాదు.. ఆమెను ఒత్తిడికి గురి చేసి తన కోరికను తీర్చుకున్నారు. మహిళపై మంత్రిగారి లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్.. టీవీ ఛానళ్లలో ప్రసారం కావటంతో.. అయ్యగారి భాగోతం లోకం మొత్తానికి తెలిసిపోయింది.
ఇంత జరిగిన తర్వాత.. మంత్రి పదవిలో ఉంచటం సాధ్యం కాని నేపథ్యంలో.. ఆయన్ను పదవికి రాజీనామా చేయాలని కోరటం.. మారు మాట్లాడకుండా తన పదవికి రాజీనామా చేసిన మేటి.. తాను సుద్దపూసనని.. తానెలాంటి తప్పు చేయలేదంటూ బుకాయించటం గమనార్హం. ఈ ఉదంతంపై నిజానిజాల్ని నిగ్గు తేల్చాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి కామకేళికి సంబంధించిన 3.23 నిమిషాల నిడివి ఉన్న సీడీ.. అతగాడి లైంగిక దాడిని లోకానికి చెప్పేసింది. సీడీలో కనిపించిన దృశ్యాలన్నీ నిజమైన పక్షంలో.. చట్టపరమైన చర్యల్ని చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు. సహచర మంత్రికి సంబంధించిన సీడీ బయటకు రావటం.. సదరు పరిణామాలపై కర్ణాటక హోం మంత్రి స్పందిస్తూ.. లోకానికి అంతా తెలిసిపోయిందని.. తాము చేసేదేమీ లేదని.. పార్టీ నాయకత్వానికి నిజాల్ని చెప్పేస్తే మంచిదన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ సీడీ దెబ్బకు కర్ణాటక అధికారపక్షం పరువు కావేరీలో కలిసిపోగా.. తమ దగ్గర అధికారపక్ష నేతలకు సంబందించిన సీడీలు ఉన్నాయని.. వాటిని బయటపెడతామంటూ సమాచారహక్కు కార్యకర్త ఒకరు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారపక్ష నేతలకు వణుకు పుట్టిస్తున్న ఈ స్టేట్ మెంట్ రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/