అదో ఫైవ్ స్టార్ హోటల్. ఎప్పటిలానే ఒక అతిధి వచ్చాడు. అందరికి మాదిరే అతడికి ఎలాంటి లోటు లేకుండా అతడు కోరిన వాటిని సర్వ్ చేశారు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను తినేసి వెళ్లిపోయిన ఆ వ్యక్తి కారణంగా ఊహించని షాక్ ను ఎదుర్కొంటున్నారు హోటల్ సిబ్బంది. ఎందుకిలా? అంటే.. వారు సర్వ్ చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రావటంతో.. సదరు సిబ్బంది పై ఆంక్షలు విధించింది ఫైవ్ స్టార్ హోటల్ యాజమన్యాం.
దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ హయత్ రిజెన్సీకి చెందిన లా పియాజ్జా రెస్టారెంట్ లో ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. ఈ రెస్టారెంట్ కు ఫిబ్రవరి 28న ఒక వ్యక్తి వచ్చి భోజనం చేశారు. అతడు వెళ్లిన తర్వాత.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లటం.. అతడికి కరోనా వైరస్ అన్న విషయం ఝూఢీ కావటంతో ఫైవ్ స్టార్ హోటల్ యాజమాన్యం అలెర్ట్ అయ్యింది.
సదరు వ్యక్తికి సర్వ్ చేసిన సిబ్బంది తో పాటు.. పలువురు ఉద్యోగుల్ని వెంటనే స్వీయ నిర్భందంలోకి ఉంచేస్తూ హోటల్ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు స్వీయ నిర్బంధం లో ఉండాలని చెప్పటం తో పాటు వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తోంది. తాజా అనుభవం తో హోటల్ లోకి వచ్చే అతిధుల టెంపరేచర్స్ (శరీర ఉష్ణోగ్రత) పరీక్షలు జరిపే హోటల్లోకి అనుమతిస్తున్నట్లుగా హోటల్ సిబ్బంది చెబుతున్నారు.