హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరింది. ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఏడాదిలో నాణ్యమైన సేవలు అందించిన విమానాశ్రయాలపై ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) నిర్వహించిన సర్వేలో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నంబర్ వన్ ర్యాంక్ లభించింది. ఏటా 50 లక్షలు-1.5 కోట్ల మంది ప్రయాణికుల విభాగంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు తొలిస్థానంలో వరించిందని ఏసీఐ వెల్లడించింది.
2009లో 4.4 గా ఉన్న హైదరాబాద్ విమానాశ్రయ స్కోర్ 2016లో 4.9కు మెరుగుపడిందని శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూపు వెల్లడించింది. ఈ సందర్భంగా జీహెచ్ ఐఏఎల్ (జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్) సీఈవో ఎస్ జీకే కిశోర్ మాట్లాడుతూ..ఏసీఐ ర్యాంకింగ్స్‌లో మనకు ప్రపంచంలోనే ప్రథమ స్థానం దక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రయాణికులు, పౌర విమానయాన మంత్రిత్వశాఖ - సీఐఎస్ ఎఫ్ - ఎయిర్ లైన్స్ ఇమ్మిగ్రేషన్ - కస్టమ్స్ అధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమైందన్నారు. గడిచిన సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరిగిందని, 1.5 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చిందని కిశోర్ తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సేవల సామర్థ్యాన్ని 2 కోట్ల మంది ప్రయాణికుల స్థాయికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీఐ వరల్డ్ డైరెక్టర్ జనరల్ ఏంజిలా గిట్టెన్స్ మాట్లాడుతూ..ప్రయాణికుల ఆదరాభిమానాలను చూరగొన్న హైదరాబాద్ విమానాశ్రయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 16-18 మధ్యలో మారిషస్ లో జరుగనున్న ఏఎస్ క్యూ అవార్డు కార్యక్రమంలో జీఎంఆర్ వర్గాలు ఈ అవార్డును అందుకోనున్నారు.
ఢిల్లీలో జీఎంఆర్ నిర్వహిస్తున్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఐజీఐఏ) కూడా ఏసీఐ అవార్డు వరించింది. ప్రతియేటా నాలుగు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే విభాగంలో నాణ్యమైన సేవలు అందించినందుకుగాను జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ (డీఐఏఎల్) ద్వితీయ స్థానంలో నిలిచిందని ఏసీఐ వెల్లడించింది. 2014 - 2015 సంవత్సరాల్లో తొలిస్థానాన్ని దక్కించుకున్నది. 2015లో 4.96గా నమోదైన ఎయిర్‌పోర్టు స్కోర్.. గత సంవత్సరంలో 4.99కి మెరుగుపడింది. ఈ విభాగ ఎయిర్‌పోర్టుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఇంచెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అగ్రస్థానం లభించింది. ఈ సందర్భంగా డీఐఏఎల్ సీఈవో ఐ ప్రభాకర రావు మాట్లాడుతూ.. ప్రయాణికులు మెరుగైన సేవలు అందించినందుకుగాను ఏఎస్‌క్యూ రెండో స్థానం లభించడం విశేషమన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/