యూటీగా హైదరాబాద్.. స్పందించిన కేంద్రమంత్రి

Update: 2021-02-14 17:30 GMT
హైదరాబాద్ ను యూటీ చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా పార్లమెంట్ లోనే ఎంఐఎం అధినేత ఓవైసీ ఈ మేరకు కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ తో సహా పలు నగరాలను చేయబోతున్నారని బాంబు పేల్చారు.

దీనిపై దేశవ్యాప్తంగా రగడ మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ను గానీ.. మరే నగరాన్ని కానీ యూటీ చేయబోమని స్పష్టం చేశారు.

హైదరాబాద్ సహా అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామని.. కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంఐఎంతో పోత్తు లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసి అదే ఎంఐఎంతో మేయర్ అయ్యారని విమర్శించారు.

ఎంఐఎం, టీఆర్ఎస్ అపవిత్ర పొత్తును ఊరూరికి తీసుకు వెళ్తామని.. ఈ పొత్తుపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ మజ్లిస్ అని.. తెలంగాణ కోసం బలిదానాలు అయిన వారి ఆత్మ ఘోషించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిధులు, నియామకాలు ఎక్కడకు పోయాయని.. సీఎం పదవిని చెప్పుతో పోల్చి కేసీఆర్ పవిత్ర రాజ్యాంగాన్ని ఓటును అవమానించారని నిప్పులు చెరిగారు.


Tags:    

Similar News