హైదరాబాద్ లో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచి కనిపించే ఆటోలు ఈ రోజు దర్శనం ఇవ్వవు. రోడ్ల మీద ఇష్టారాజ్యంగా నడిచే ఆటోలు.. తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఓలా.. ఉబెర్ క్యాబ్ లు వ్యవహరిస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసనలో భాగంగా హైదరాబాద్ రోడ్ల మీద ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం అర్థరాత్రి వరకూ ఆటోల్ని రోడ్ల మీదకు తీసుకురాకూడదని డిసైడ్ చేశారు.
ఓలా.. ఉబెర్ క్యాబ్ ల కారణంగా ఆటో డ్రైవర్ల జీవితం సంక్షోభంలో పడుతుందని వారుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. ప్రభుత్వ తీరునను నిరసిస్తూ తాము నిరసన చేపట్టినట్లుగా ప్రకటించారు. ఆటో డ్రైవర్ల నిరసన నేపథ్యంలో హైదరాబాద్ రోడ్ల మీద ఆటోలు కనిపించవు. తమకు చాలా పెద్ద అన్యాయం జరుగుతున్నట్లుగా వాపోతున్న ఆటోవాలాలు మాటల్లో నిజం ఎంత ఉందన్నది హైదరాబాద్ లోని సగటుజీవికి బాగానే తెలుసు. పెద్ద పెద్ద విషయాల్ని పక్కన పెట్టేసి..సింఫుల్ గా చాలా చిన్న విషయాన్నేతీసుకుంటే.. హైదరాబాద్ లోని ఏ ఆటోవాలా అయినా ధర్మంగా మీటర్ మీద ఛార్జ్ తీసుకుంటాడా? రెండు కిలోమీటర్ల దూరానికి చట్టప్రకారం వసూలు చేయాల్సిన మొత్తాన్నే వసూలు చేస్తాడా?
ఒక ఆటోవాలాను ఫలానా చోటుకు వస్తావా? అంటే చాలామంది రామంటే రామని మొండికేస్తారు. తాము రావాలంటే మీటర్ మీద పాతికో.. యాభయ్యో ఎక్స్ ట్రా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. మరి.. అలాంటి మాటలేమీ ఓలా.. ఉబెర్ క్యాబ్ ల వారి విషయంలో కనిపించదు. అంతేకాదు.. ఆటో ఎక్కే ముందు ఒక రేటు చెప్పి.. ఆటో దిగేటప్పుడు పది.. ఇరవై ఎక్స్ ట్రా అడగటం.. ఇవ్వని వారిని తిట్టేయటం చాలామందికి అనుభవమైన విషయమే. ఇలా ప్రయాణికుల విషయంలో.. వారి సంక్షేమం విషయంలో ఏ మాత్రం పట్టని ఆటోవాలాలు.. ఇవాళ తమ సంక్షేమాన్ని అందరూ పట్టించుకోవాలంటూ నిరసన చేయటాన్ని ఎలా చూడాలి? తమ కష్టాల గురించి ఆలోచించాలని డిమాండ్ చేసే ఆటోవాలాలు.. ముందు జనాలకు ఎలాంటి కష్టం లేకుండా ఆటోవాలాలు ఎందుకు వ్యవహరించటం లేదన్న విషయం మీద ఏం సమాధానం చెబుతారు..?