శత్రుదేశమంని ఎవరికెవరూ ప్రకటించకపోయినా భారత్, పాకిస్థాన్ ల మధ్య సంబంధాల పరంగా పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయి. ఇటీవల కాలంలోనూ ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోయినా ఇతర విషయాల్లో మాత్రం రెండు దేశాల మధ్య మనసు కదిలించే సంఘటనలు జరుగుతున్నాయి. రెండు దేశాల ప్రజలు కూడా ఒకరి గురించి ఇంకొకరు మంచిగా అనుకునే సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. హుద్రోగంతో బాధపడుతున్న పదేళ్ల పాకిస్థాన్ బాలుడికి చైన్నై ఆసుపత్రిలో గుండెమార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాదు.... హైదరాబాద్ కు చెందిన అబ్బాయి గుండెను ఆ అబ్బాయికి అమర్చారు.
దుబాయ్ లో నివసిస్తున్న పాకిస్థాన్ సంతతికి చెందిన పదేళ్ల బాలుడు గుండెకు సంబంధించిన రుగ్మతతో నెల రోజుల కిందట చెన్నైలోని ఫ్రాంటియర్ లైఫ్ లైన్ ఆసుపత్రిలో చేరాడు. అతడికి అత్యవసరంగా గుండె మార్పిడి చేయాల్సి ఉందని గుర్తించిన వైద్యులు హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ నుంచి గుండెను తీసుకోవాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 12 ఏళ్ల వైష్ణవ్ గుండెను హుటాహుటిన చెన్నైకు తరలించారు. ఇందుకోసం గ్లోబల్ ఆసుపత్రి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ హైదరాబాద్ పోలీసులు గ్రీన్ కారిడార్ ను ప్రకటించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. గ్లోబల్ ఆసుపత్రి నుంచి వైష్ణవ్ గుండెను 30 నిముషాలలో శంషాబాద్ విమానాశ్రయానికి చేర్చారు. అక్కడ నుంచి విమానంలో చెన్నై చేరుకున్న ఆ గుండెను చెన్నై విమానాశ్రయం నుంచి ఫ్రంటియర్ లైఫ్ లైన్ ఆసుపత్రికి చేర్చడానికి 20 నిముషాలు పట్టింది. ఆ వెంటనే పాక్ బాలుడికి మన హైదరాబాద్ వైష్ణవ్ గుండెను ట్రాన్సప్లాంట్ చేశారు.
ఇంతకుముందు సిరియాలో చిక్కుకున్న పాకిస్థానీలను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆ దేశ బృందాలు అక్కడున్న 50మంది భారతీయులను తమతో తీసుకొచ్చి ఇండియాకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి పంపించాయి. ఇప్పుడు పాకిస్థాన్ బాలుడికి ఇండియాలో గుండె మార్పిడి చేయడం విశేషం. ప్రభుత్వాల విధానాలు ఎలా ఉన్నా ప్రజల మధ్య సామరస్యం ఏర్పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. అంతంతమాత్రంగా వైద్య సదుపాయాలున్న సోదర దేశంలో బాధితులు ఇలా ఇండియాకు వచ్చి వైద్యం, శస్త్రచికిత్సలు చేయించుకోవడం మున్ముందు ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.