అందులో దేశంలోనే మొదటి స్థానంలో హైదరాబాద్ ..ఎందులో అంటే ?

Update: 2020-07-24 16:00 GMT
హైదరాబాద్ చరిత్రలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. దేశంలోనే అత్యధిక నిఘానేత్రాలు ఉన్న సిటీల జాబితాలో హైదరాబాద్ దేశంలో మొదటిస్థానంలో ఉంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే గుర్తించడానికి బహిరంగ ప్రదేశాల పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఉపయోగించే నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో 3 లక్షలకుపై గా నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు ) ఉన్నాయి. అలాగే , అంతర్జాతీయంగా టాప్‌ 20 నగరాల్లో 16వ స్థానాన్ని సంపాదించుకుంది.

టాప్‌ 20లో లండన్‌ 3వ స్థానంలో నిలువగా, హైదరాబాద్‌ తప్ప మిగతావన్నీ చైనాలోని నగరాలేనని యూకేకు చెందిన కంపారిటెక్‌ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్‌–50 నగరాల్లో చెన్నైకు 21, దేశ రాజధాని ఢిల్లీకి 33వ ర్యాంక్‌ లభించాయి. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రతి 1,000 మందికి సుమారుగా 30 కెమెరాలున్నాయి. ప్రతి 1,000 మందికి 25.52 కెమెరాలతో చెన్నై 21వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ నివాసానికి దేశంలో అంత్యంత అనువైన సిటీగా చెప్పవచ్చు.
Tags:    

Similar News