దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్తి వివరాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ నెలాఖరులోపు షాద్ నగర్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ చార్జిషీట్ లో ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్టుమార్టం నివేదికను పోలీసులు ఆధారంగా చూపించారు. సీసీ ఫుటేజీని సాక్ష్యంగా నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో దిశకు మద్యం తాగించి అత్యాచారం చేశారన్న విషయం నిర్ధారణ అయ్యింది. ఇక 50 మంది సాక్ష్యులను అధికారులు విచారించారు.
ఈ కేసుపై ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు, సుప్రీం కోర్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పక్కా ఆధారాలతో కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. మున్ముందు విచారణలో ఈ చార్జిషీట్ కీలకంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.