మీరు చూస్తున్నది దుబాయ్ కాదు.. హైదరాబాద్

Update: 2022-01-02 04:31 GMT
అవును.. మీరు చూస్తున్న ఈ ఫోటో అచ్చంగా హైదరాబాదే. చూసినంతనే ఏ సింగపూరో.. దుబాయో.. లేదంటే విదేశాల్లోని ఏదైనా ఫుల్లీ డెవలప్ అయిన మహానగరమో అనుకోవచ్చు. కానీ.. అదేమీ కాదు. ఇది అసలుసిసలు పక్కా హైదరాబాద్ ఫోటో. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక మహానగరంగా మారిన హైదరాబాద్ శరవేగంగా దూసుకెళ్లిపోతోంది. దీనికి తగ్గట్లు.. తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల్ని కల్పించే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు.. మహా నగరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేస్తోంది.

హైదరాబాద్ అన్నంతనే గుర్తుకు బస్తీలు.. మురికివాడలు.. ఇరుకైన దారులు.. లాంటివి ఉన్నప్పటికీ.. నయా సిటీగా మారిన సైబరాబాద్ పరిధిలోని కొంత భాగం ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. మన కళ్లను మనమే నమ్మలేని రీతిలో టవర్ల నిర్మాణంతో పాటు.. భారీ ఎత్తున నిర్మించిన బహుళ అంతస్తులు.. రవాణాకు ఇబ్బందులు కలగకుండా.. ట్రాఫిక్ బ్లాకుల్ని అధిగమించేందుకు వీలుగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు సాగుతున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున హైదరాబాద్ మహానగరంలో అతి పొడవైన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఓపెన్ చేయటం తెలిసిందే.

2.7 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ ఫ్లైఓవర్ కొత్త సంవత్సరం కానుకగా హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయిన నేపథ్యంలో.. ఆ ప్రాంతంలోని నగరాన్ని కెమేరాలో బంధించే ప్రయత్నం చేశారు. రాత్రి వేళ.. ఈ ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్.. దీనికి ఇరువైపులా ఉన్న భారీ భవనాలతో కనువిందు చేస్తోంది. చూసినంతనే మరో దేశానికి చెందినదిగా ఉన్న ఈ ఫోటో.. మారుతున్న హైదరాబాద్ ముఖ చిత్రానికి నిదర్శనమని చప్పాలి. ఏమైనా.. భారీ ఎత్తున విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News