హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో పదో తరగతి బాలికను నలుగురు పదో తరగతి విద్యార్థులు, ఒక తొమ్మిదో తరగతి విద్యార్థి గ్యాంగ్ రేప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురు నిందితులను జువైనల్ హోంకు పోలీసులు తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
బాలిక తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి పుస్తకం కావాలంటూ వచ్చిన ఆమె స్నేహితులే బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. కాగా పోలీసుల దర్యాప్తులో అనేక విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయని చెబుతున్నారు.
నిందితులు ఐదుగురు బాలికను అత్యాచారం చేయాలని ముందుగానే ప్రణాళిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తరచూ ఫోనుల్లో అశ్లీల వీడియోలు చూసిన ఐదుగురు బాలురు.. ఆ వీడియోల్లో ఉన్నట్టే తామూ చేయాలని భావించారు. ఇందుకోసం తమ ఇళ్లకు దగ్గరగా ఉన్న, తమతో స్నేహంగా ఉంటున్న బాలికను ఇందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు.
బాలిక తల్లిదండ్రులు ఉదయాన్నే కూలి పనులకు వెళ్లిపోయే సంగతి ఐదుగురు నిందితులకు తెలుసు. ఈ క్రమంలోనే వారు తమ ప్రణాళికను అమల్లో పెట్టారు. పుస్తకం కావాలంటూ బాలిక ఇంటికెళ్లిన వారు బెదిరించి, భయపెట్టి అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. ఎవరికైనా చెబితే ఈ వీడియోను అందరికీ చూపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టారు. ఇలా పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో ఫోన్లలో అశ్లీల వీడియోలు చూడటానికి ఐదుగురు బాలురు అలవాటు పడ్డారు. వారికి డ్రగ్స్ అలవాటు కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. రోజూ పాఠశాల ముగియగానే నిందితులంతా జనాలు ఎవరూ లేని ప్రాంతాలకు వెళ్లి నీలి చిత్రాలు, వీడియోలు చూసేవారు.
ఈ క్రమంలో ఆయా వీడియోల్లో ఉన్నట్లుగా తామూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తమతో స్నేహంగా ఉంటున్న పదో తరగతి బాలిక సరైనదిగా భావించారు. మరోవైపు బాలిక మనస్తత్వం కూడా నిందితులకు కలసి వచ్చింది. బాలిక మనస్తత్వం చిన్నపిల్లలా ఉంటుందని చెబుతున్నారు. బాలికకు అంతగా మానసిక వికాసం కూడా లేదని అంటున్నారు. దీంతో ప్రణాళిక ప్రకారం బాలిక ఇంటికెళ్లి ఆమెకు మాయమాటలు చెప్పారు. పుస్తకం పేరుతో ఇంటికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీశారు.
మరోవైపు బాలికపై గ్యాంగ్‌రేప్‌కు సంబంధించి బాధిత బాలిక పాఠశాల, నివసించే ప్రాంతాన్ని కొన్ని మీడియా సంస్థలు బయటపెట్టడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.