హైదరాబాదీ అమ్మాయి అద్భుతం సాధించింది. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఎవరూ ఊహించని విధంగా మిస్ ఇండియా అయ్యింది.
ఈ సంవత్సరం మిస్ అండ్ మిసెస్ ఇండియా పోటీలను ఇండి రాయల్ ఇనిస్టిట్యూట్ నిర్వహించింది.
గ్రాండ్ ఫినాలే బంజారాహిల్స్‌లో జరిగింది. భారతదేశం నలుమూలల నుండి 42 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. హైదరాబాదీ అమ్మాయి సంజన మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచింది.
ప్రతి పోటీ 10 రౌండ్లలో నిర్వహించారు. ఇక్కడ 10 మంది మిస్ ఇండియా టైటిల్ కోసం ఫైనల్ లో పోటీ పడ్డారు, 17 మంది మిసెస్ ఇండియా టైటిల్ కోసం పోటీపడ్డారు.. 15 మంది సభ్యులు మిసెస్ ఇండియా క్లాసిక్ టైటిల్ కోసం పోటీపడ్డారు.
ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా నటి అర్చన, తెలుగు సినిమా సంఘం సభ్యుడు ఎం వీర శంకర్ మరియు ఇతర 3 సభ్యులు ఉన్నారు. ఇందులో హైదరాబాద్ అమ్మాయి సంజనకు మిస్ ఇండియా కిరీటం దక్కింది.