భయాందోళనలో హైదరాబాద్‌ ...దక్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్రయాణికులు !

Update: 2021-11-29 15:32 GMT
కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మళ్లీ యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న వార్తలే ఇందుకు కారణం. దక్షిణాఫ్రికా లో బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ సహా మరికొన్ని దేశాల్లో ఈ వేరియంట్‌ బయటపడింది. దీనితో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాలు విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో భారత్ కూడా అప్రమత్తమవుతోంది.

ద‌క్షిణాఫ్రికాలో మొద‌లైన ఈ వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచంలోని అనేక దేశాల‌కు వ్యాపించింది.  దీంతో సౌత్ ఆఫ్రికా పై 18 దేశాలు ఆంక్ష‌లు విధించాయి. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై కేంద్రం దృష్టిసారించింది. హైద‌రాబాద్‌ లోని శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ కు వ‌చ్చే అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై ప్ర‌త్యేక‌మైన దృష్టిని సారించారు అధికారులు. వివిధ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ఎయిర్‌పోర్ట్‌లో క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  ఈనెల 25,26,27 తేదీల్లో ద‌క్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్ర‌యాణికులు వ‌చ్చార‌ని అధికారులు దృవీక‌రించారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వారడమే అందరిలో భయం మొదలైంది. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చినవారు ఇందులో ఉన్నారు. భాగ్యనగరం వచ్చినవారందరికీ ప్రత్యేక బృందాలు ఆర్‌ టీపీసీఆర్‌  పరీక్షలు చేశాయి. ఇందులో 11 మందికి పాజిటివ్‌ అని తేలడం విశేషం. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు. 
Tags:    

Similar News