మెట్రో చార్జీలు ప్రకటించిన హెచ్ఎమ్మార్

Update: 2017-11-25 13:08 GMT
గ‌త కొద్దికాలంగా...ఇదిగో అదిగో అంటూ ఊరించేందుకు ప‌రిమిత‌మైన‌ మెట్రోచార్జీల‌ను ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్ర‌క‌టించింది. ఈనెల 28న ప్రధాన‌మంత్రి  న‌రేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఆ మ‌రుస‌టి రోజు అంటే 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు. మొదటి రెండు స్టేషన్ల వరకు టికెట్ ధర రూ. 10 గా ఉంటుంది. ఫస్ట్ స్టేజీ నుంచి లాస్ట్ స్టేజీ వరకు ప్రయాణిస్తే ధర రూ. 60 ఉంటుంది. ఒక స్టేషను, రెండు స్టేషన్ల వరకు రూ. 10 టికెట్ ఉంటుంది.

కనిష్ట చార్జీ-10
గరిష్ట చార్జీ-60

2 కిలోమీట‌ర్ల‌ వరకు 10/- రూపాయలు...

2 నుంచి 4 కిలోమీట‌ర్ల వరకు 15/- రూపాయలు..

4 నుంచి 6 కిలోమీట‌ర్ల వరకు 25/-

6 నుంచి 8 కిలోమీట‌ర్ల వరకు 30/-

8 నుంచి 10 కిలోమీట‌ర్ల వరకు35/-

10 నుంచి 14 కిలోమీట‌ర్ల వరకు 40/-

14 నుంచి 18 కిలోమీట‌ర్ల వరకు 45/-

14 నుంచి 22 కిలోమీట‌ర్ల వరకు50/-

22 నుంచి 26 కిలోమీట‌ర్ల వరకు 55/-

26 వ కిలోమీట‌ర్ల ర్వాత 60/-
Tags:    

Similar News