వీకెండ్ వస్తుందంటే చాలు.. భారీ ఎత్తున ప్లాన్స్ చేసేస్తున్న పరిస్థితి. వారాంతంలో పని ఒత్తిడి నుంచి ఫ్రీ అయిపోయి.. హాయిగా సేద తీరే కన్నా.. ఈ సెలవుల్లో మరేదైనా పని పెట్టుకోవటం.. ఎక్కడికో అక్కడికి వెళ్లే ప్లాన్ చేసుకోవటం.. షార్ట్ టర్మ్ డెస్టినేషన్స్ కు వెళ్లేలా ప్లాన్ చేయటం లాంటివి చేస్తున్న పరిస్థితి.
ఈ వీకెండ్ మొదలు సోమవారం వరకూ వరుసగా మూడురోజులు (శని.. ఆది.. సోమవారం జన్మాష్టమి) సెలవులు వస్తున్న పరిస్థితి. అయితే.. అందరికి కాదు కానీ కొందరికి మాత్రమే సుమా. ఇలా సెలవులు వస్తుంటే.. మస్తు ప్లాన్లు వేయటం కామన్. కానీ.. ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్.. చుట్టుపక్కల వారితో సహా.. తెలంగాణ వ్యాప్తంగా ఎవరూ ఎక్కడికి వెళ్లాలన్న ప్లాన్ చేసుకోకపోవటం ఉత్తమంగా చెప్పక తప్పదు.
తమ నాలుగున్నరేళ్ల పాలనను ప్రజలకు వివరించి చెప్పేందుకు వీలుగా భారీ ఎత్తున ప్రగతి నివేదన సదస్సును టీఆర్ ఎస్ ప్లాన్ చేయటం తెలిసిందే. అధికారపార్టీ నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు ఏకంగా పాతిక లక్షల మందిని తీసుకురావాలన్న ఆలోచనలో టీఆర్ ఎస్ ఉంది. ఇంత పెద్ద ఎత్తున జనసమీకరణకు అవసరమైన లక్షకు పైగా వాహనాల్ని టీఆర్ ఎస్ వర్గాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో బయటకు వెళ్లే వారు ఆదివారం ఇంట్లో ఉండిపోవటం బెటర్. ఎందుకంటే.. బయటకు వెళితే బస్సులు ఉండని పరిస్థితి. ఇక.. హైదరాబాద్ తో పాటు.. చుట్టుపక్కల శివారు సభ హడావుడితో రోడ్లు బ్లాక్ అయ్యే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి బుక్ అయ్యే కన్నా.. ఇంట్లోనే ఉండటం.. లేదంటే సందు చివరన ఉన్న స్నేహితుల్ని.. చుట్టాల్ని కలుసుకోవటం బెటర్ అంటున్నారు. అంతేకానీ.. సరదాగా గడుపుదామని ప్లాన్ చేస్తే అడ్డంగా బుక్ కావటం ఖాయమంటున్నారు. సో.. బీకేర్ ఫుల్.