ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ..హైదరాబాద్ కి చేరుకోవడంతో నగరవాసులు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణాలో కరోనా అనుమానిత కేసులో గంట గంటకి పెరిగిపోతున్నాయి. దీనితో ఈ వైరస్ తమకి ఎక్కడ వస్తుందో అని హైదరాబాద్ భయపడిపోతున్నారు. అయితే , తెలంగాణలో నమోదైన అన్ని కరోనా కేసులలో , రిపోర్ట్స్ లో నెగటివ్ గా వచ్చింది అని , దుబాయ్ నుండి వచ్చిన ఒక్క వ్యక్తికీ మాత్రమే కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు మంత్రి ఈటెల చెప్పారు. మరో రెండు , మూడు రోజుల్లో అతడు కూడా కరోనా నుండి కోలుకుంటాడు అని తెలిపారు.
ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటుచూసినా కూడా కరోనా వైరస్ పేరే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోమియోపతి మందు కోసం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ముందు వందలాది మందు బారులు తీరుతున్నారు. కరోనా వైరస్ రోగనిరోధక ఔషధం పేరిట తెలంగాణ ఆయుష్ విభాగం ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి హోమియోపతి మందుల్ని పంపిణీ చేస్తోంది. ఆర్సెనిక్ ఆల్బ్ 30 పీ ఔషదం కరోనాను నిరోధిస్తుందనే కేంద్రం సూచన మేరకు తెలంగాణ ఆయుష్ విభాగం వీటిని పంపిణీ చేసింది.
మంగళవారం ఒక్కరోజే 3500 మందికి 11,500 డోసుల ఔషధాన్ని పంపిణీ చేశారు. ఈ హోమియోపతి ఔషధాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ తరహా పిల్స్‌ను శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారికి - స్వైన్ ఫ్లూ సోకిన వారికి కూడా ఇచ్చామని వైద్యాధికారులు తెలిపారు. ఆర్సెనికా ఆల్బ్ ఔషధం కరోనా వైరస్ కోసం తయారు చేసింది కాదని.. కానీ ఏ రకమైన ఇన్ ప్లూయెంజాకైనా ఉపయోగించొచ్చన్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు మాట్లాడుతూ - జలుబు - దగ్గు - జ్వరాన్ని హోమియోపతి మందు ఆర్సెనిక్ 30 కంట్రోల్ చేస్తుందని - ఎయిర్ పోర్టులో ఇప్పటి వరకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన వారికి ఈ మందు ఇచ్చామని , ఈ మందు వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని తెలిపారు. రామంతపూర్ లోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో ఈ మందు అందజేస్తున్నామని, ఏడాది మొత్తం ఈ మందు అందుబాటులో ఉంటుందని తెలిపారు.