ఆ కిలేడీ హార్డ్ కోర్ ఐసిస్ కార్యకర్త బాస్

Update: 2015-09-14 10:21 GMT
అమాయకంగా.. పక్కింటి ఆంటీలా కనిపిస్తూ.. పాపం.. పుణ్యాలు పెద్దగా తెలీనట్లుగా కనిపించే ఆమె గురించి నిజాలు విన్న వారందరికి షాక్ కలిగిస్తోందీ. ఈ మధ్యనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐసిస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరురాలు నిక్కీ జోసెఫ్ అలియాస్ అఫ్సా జబీన్ నోట వెంట వస్తున్న నిజాలు షాక్ కలిగించేలా ఉన్నాయి.

భారత్ లోని యువకుల్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ.. వారిని ఐసిస్ లో చేరేందుకు ఆమె చేపట్టిన చర్యలు విన్న పోలీసు అధికారులు నిర్ఘాంత పోతున్నారట. తాను చేసిన పనుల గురించి పూసగుచ్చినట్లుగా వివరిస్తున్న ఆమె యవ్వారాల్ని విన్న వారంతా ఆమె ఎంత హార్డ్ కోర్ ఐసిస్ సానుభూతి పరురాలో తెలుస్తుందని చెబుతున్నారు.

తన రహస్య ప్రియుడు మొహినుద్దీతో కలిసి 2010లో ఫేస్ బుక్ గ్రూప్ ఏర్పాటు చేశామని.. దాదాపు నాలుగు గ్రూపుల్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల పట్ల తాను ఆకర్షితురాలినయ్యానని.. సున్నీలు.. షరియత్ చట్టం కోసం పోరాడుతున్న ఐసిస్ విధానాలకు తాను ఆకర్షితురాలిని అయినట్లుగా ఆమె చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఐసిస్ కార్యకలాపాల్ని వీడియోలుగా తయారు చేసి భారతీయ యువతను రెచ్చగొట్టామని.. ఐసిస్ వీడియోలు పోస్ట్ చేయటంతో ఫేస్ బుక్ తమ అకౌంట్ ను తొలిగించినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ జనవరిలో మొహినుద్దీన్ అరెస్ట్ కావటంతో ఫేస్ బుక్ అకౌంట్.. ఐడీని క్లోజ్ చేసినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. బయటకు వచ్చిన సమాచారం కొంతే అయినా.. ఆమె చాలా విలువైన సమాచారం అందించినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద చర్యలు ప్రపంచమంతా అసహ్యించుకుంటంటే.. అందుకు భిన్నంగా మొన్నటి వరకూ మన మధ్యనే ఉన్న ఒక మహిళ గుట్టు చప్పుడు కాకుండా చేసిన చేష్టలు పోలీస్ వర్గాల్లో ఇప్పుడు కొత్త సందేహాలకు కారణం అవుతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News