వాహనాలు నడిపే వారి విషయంలో చట్టం మరింత కఠినంగా వ్యవహరించనుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. ఇప్పుడో మరో కొత్తబాట పట్టారు. దీని ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపే వారిపై చర్యలతో పాటు.. సదరు వాహనాన్ని ఇచ్చిన యజమానిని సైతం బుక్ చేయాలని హైదరాబాద్ పోలీసులు డిసైడ్ చేశారు.
దీంతో.. ఎవరికైనా వాహనం ఇచ్చే ముందు.. సదరు యజమాని వాహనాన్ని నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదా? అన్నది చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చి.. లైసెన్స్ లేని వ్యక్తి పోలీసులకు పట్టుబడితే.. అతనే కాదు.. బండి ఇచ్చిన పాపానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
సో.. ఫ్రెండ్స్ కావొచ్చు..బంధువులు కావొచ్చు.. తెలిసిన వారైనా కావొచ్చు. చేతికి బండి ఇవ్వాలనుకుంటే మాత్రం.. కచ్ఛితంగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదా? అన్నది చూసుకొని ఇవ్వాలే తప్పించి.. లైట్ తీసుకొని బండి ఇస్తే మాత్రం.. బుక్ అయినట్లే. సో.. బీకేర్ ఫుల్ బాస్.