మీరెప్పుడు విన‌ని టాప్ 10 లిస్ట్ రిలీజ్

Update: 2017-08-14 05:11 GMT
మీరు ఇప్ప‌టివ‌ర‌కూ చాలానే టాప్ 10 లిస్ట్ ల గురించి విని ఉంటారు. చ‌దివి ఉంటారు. కానీ.. ఇప్పుడు మేం చెప్పే టాప్ 10 లిస్ట్ గురించి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ విని ఉండ‌ర‌ని చెప్పొచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల్ని అదే ప‌నిగా అతిక్ర‌మించే టాప్ టెన్ వాహ‌నాలు.. గ‌డిచిన మూడేళ్ల‌లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి జ‌రిమానా ప‌డిన టాప్ 10 వాహ‌న‌దారుల లిస్టును హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుద‌ల చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ లిస్ట్ లో ఉన్న ఒక డీసీఎం బండి ఖ‌రీదు రూ.9 ల‌క్ష‌లు అయితే.. గ‌డిచిన మూడేళ్ల‌లో ఆ బండి మీద ప‌డిన ఫైన్ ఏకంగా రూ.7.64 ల‌క్ష‌లు కావ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. రూ.4 లక్ష‌లు విలువ‌ చేసే ఒక ఆటో గ‌డిచిన మూడేళ్ల‌లో క‌ట్టిన ఫైన్ ఏకంగా రూ.5.73 ల‌క్ష‌లు కావ‌టం విశేషంగా చెప్పాలి. అంతేనా.. హెల్మెట్ ధ‌రించ‌ని ఒక టూవీల‌ర్ వాహ‌న‌దారుడిపై గ‌డిచిన మూడేళ్ల వ్య‌వ‌ధిలో ఏకంగా 97 కేసులు ఫైల‌యిన‌  వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి అవాక్కు అయ్యేలా చేసింది.

ల‌క్ష‌లాది రూపాయిల్ని జ‌రిమానా కింద చెల్లించిన వాహ‌నాల్లో ఎక్కువ‌గా వాణిజ్య వాహ‌నాలే ఉంటున్నాయి. ఇందులో కొంద‌రు చేస్తున్న ప‌ని షాకింగ్ గా మారింద‌ని చెబుతున్నారు. వాణిజ్య వాహ‌న‌దారులు రోజులో ఏదో ఒక టైంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌ చేస్తున్న‌ట్లుగా ఫైన్ వేయించుకొని.. ఆ ర‌శీదు ప‌ట్టుకొని రోజు మొత్తం ద‌ర్జాగా తిరిగేస్తున్న వైనాన్ని ట్రాఫిక్ పోలీసులు తెర మీద‌కు తీసుకొచ్చారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తాజాగా అమ‌లు చేస్తున్న పాయింట్ల విధానం సాయం చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

గ‌డిచిన మూడేళ్ల‌లో భారీ జ‌రిమానాలు చెల్లించిన టాప్ 10 వెహికిల్స్ లిస్ట్ చూస్తే..

వాహనం నంబర్‌                చెల్లించిన ఫైన్‌

ఏపీ09వీ6780                 రూ.7,64,220
ఏపీ29వీ3285                 రూ.6,63,625
ఏపీ28యూ2081             రూ.6,55,635
ఏపీ09వీ8015                 రూ.5,99,345
ఏపీ28యూ1711             రూ.5,78,330
ఏపీ29డబ్ల్యూ0814            రూ.5,73,830
ఏపీ28యూ2078             రూ.5,59,455
ఏపీ28యూ2139             రూ.5,36,885
ఏపీ09వీ6872                 రూ.5,25,575
ఏపీ09వీ6735                 రూ.5,23,680

గత మూడేళ్లలో ‘హెల్మెట్‌’చలాన్లు కట్టిన టాప్‌–10 టూ వీలర్స్‌..

వాహనం నంబర్‌           చలాన్లు

ఏపీ10ఎఫ్‌8737            97
ఏపీ11ఏఈ8321           90
ఏపీ09బీఈ3503           68
ఏపీ12ఈడీ6291           60
ఏపీ12కే1366              58
పీ12ఏ9424                58
ఏపీ12ఈబీ9658           57
ఏపీ09సీడీ4775            55
ఏపీ13హెచ్‌6054           54
ఏపీ28డీఎం0568          53
Tags:    

Similar News