డొక్కు లారీ. చూసేందుకు ఏ మాత్రం ప్రత్యేకత లేని లారీ. చాలా పాతకాలం నాటిది. కానీ.. అందులో ఉన్నది తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో 10 టన్నులు (టన్ను అంటే వెయ్యి కిలోలు. 10 టన్నులు అంటే 10వేల కేజీలు) వెండి దిమ్మలు రవాణా చేస్తున్నట్లుగా గుర్తించి అవాక్కు అయ్యారు.
చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ఈ కంటైనర్ ను పోలీసులు అడ్డుకొని సోదాలు నిర్వహించగా.. ఈ విషయం బయటకు వచ్చింది. గుట్టుచప్పడు కాకుండా తరలిస్తున్న ఈ వెండి విలువ రూ.40 కోట్ల మేర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ లారీని తనిఖీ చేసినట్లుగా చెబుతున్నారు.
షాకింగ్ విషయం ఏమంటే.. ఈ లారీతో పాటు ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. లారీ డ్రైవర్ తో పాటు.. మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వారి వద్ద మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో వెండి పట్టుబడటంతో దీని వెనుక ఏముంది? ఈ దందా వెనుక ఎవరున్నారు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పదివేల కేజీల వెండి గుట్టుచప్పుడు కాకుండా డొక్కు లారీలో వస్తుందంటే.. సిటీలో జరుగుతున్నఈ తరహా దందా ఎంత పెద్దది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.