అధికారులంతా ఒకేలా ఉండరు. కొందరు తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అధికారుల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వారిలో హైదరాబాద్ సీపీగా వ్యవహరిస్తున్న అంజనీకుమార్ ఒకరుగా చెప్పాలి. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్ కు పెద్దపీట వేసేందుకు తన వంతు సాయం చేస్తానని చెబుతారు.
ఇందుకు తగ్గట్లే తాజాగా ఆయనో ఆసక్తికర ప్రకటన చేశారు. హైదరాబాద్ సిటీలోని పోలీసులు అవినీతి అక్రమాలకు పాల్పడినా.. వేధింపులకు గురి చేసినా.. తనకే నేరుగా ఫోన్ చేయాలని ఆయన కోరుతున్నారు. ఇందులో భాగంగా 9490616000 తన ఫోన్ నెంబర్ ను ఇచ్చేశారు. సంబంధం లేని వ్యవహారాలకుసంబంధించి పోలీసులు ఎవరైనా వచ్చి అనవసరంగా చికాకు పెడుతున్నారు.. వేధింపులకు గురి చేస్తున్నా.. తననే నేరుగా సంప్రదించాలని కోరుతున్నారు.
వీధి పక్కన వ్యాపారం చేసుకునే వ్యాపారులపై పోలీసులు కొందరు వేధిస్తున్న వైనాన్ని అంజనీ కుమార్ దృష్టికి వెళ్లటం.. ఆ వెంటనే చర్యలు తీసుకున్న ఆయన.. పోలీసుల వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
సమస్య ఉన్న వారు ఎవరైనా సరే.. తనను సంప్రదించాలని.. తన దృష్టికి ఇష్యూను తీసుకొస్తే తాను సాల్వ్ చేస్తానని చెబుతున్నారు. ఒక పోలీస్ ఉన్నతాధికారి తన ఫోన్ నెంబరును ఇచ్చేయటం.. సమస్యలు ఎదురైతే తనకే నేరుగా కాల్ చేయాలని కోరటం హాట్ టాపిక్ గా మారింది. ముక్కుసూటి అధికారి ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చి.. ఫోన్ నెంబర్ ఇస్తుంటే సేవ్ చేసుకోకపోతే ఎలా?