మహమ్మారి వైరస్ వ్యాప్తిని కొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రజల అమాయకత్వం.. భయాన్ని కొందరు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో ఒకటి చోటుచేసుకుంది. మంత్రాలతో మహమ్మారి వైరస్‌ను తరిమికొడతానని ప్రకటించుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అలా చాలామంది నుంచి వసూల్ చేసి చివరకు పరారయ్యాడు. దీంతో డబ్బులు చెల్లించిన వారంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తాయెత్తులు కట్టుకుంటే వైరస్ సోకదని.. ఒకవేళ సోకినా తగ్గుముఖం పడుతుందని బాబా అవతారమెత్తిన ఇస్మాయిల్ చెప్పాడు. తాయెత్తులు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.12 వేల వరకు వసూల్ చేశాడు. అలా కొన్ని రోజులు చేసి చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో డబ్బులు చెల్లించిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇస్మాయిల్ కోసం గాలించారు. చివరకు అతడు హఫీజ్‌పేటలో పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విధంగా బాబాలు.. స్వామిజీలు వైరస్‌ను తగ్గిస్తామని ప్రజల భయం.. అమాయకత్వాన్ని నమ్మి మోసపోతున్నారు. ఒక్క విషయం గమనించాలి.. స్వీయ జాగ్రత్తలతోనే వైరస్ రాదనే విషయం గ్రహించి జాగ్రత్తలు పాటించండి చాలు.