బ్రేకింగ్: హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

Update: 2022-04-05 13:30 GMT
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక నిందితుడైన లక్ష్మీపతి.. వారం రోజులుగా పరారీలో ఉన్నాడు. చివరకు పోలీసులకు మంగళవారం చిక్కాడు. లక్ష్మీపతికి హైదరాబాద్ లో భారీ నెట్ వర్క్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు స్పాప్ చాట్, టెలిగ్రామ్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ఫాట్ ఫాం ద్వారా వల వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.  లీటర్ హాష్ ఆయిల్ ను రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

డ్రగ్స్ దందాలో లక్ష్మీపతి నెట్ వర్క్ లో 100 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో లక్ష్మీపతిపై కేసులు నమోదయ్యాయి.

మత్తు కోసం పలు రకాల మాదక ద్రవ్యాలను ఏకకాలంలో తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతిచెందాడని తేలింది. ఆస్పత్రిలో చేరే సమయానికి సరిగ్గా నడవలేకపోవడం.. మాటల్లో తడబాటు గమనించి వైద్యులు యువకుడు డ్రగ్స్ కు బానిసైనట్లు తల్లిదండ్రులు మొదట్లో చెప్పలేదని అనుమానం వచ్చి స్నేహితులను అడిగితే అసలు విషయం డ్రగ్స్ అని తేలింది.

హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసైన బీటెక్ విద్యార్థి  కేసులో ఇప్పటికే పోలీసులు జూబ్లీహిల్స్, నల్లకుంట పరిధిలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.  బీటెక్ విద్యార్థి తరచూ గోవా వెళ్లి  డ్రగ్స్ తీసుకునేవారు. ఈ క్రమంలోనే మోతాడు ఎక్కువై విద్యార్తి మృతి చెందినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ప్రేమ్ ఉపాధ్యాయ్ గోవా నుంచి మత్తు పదార్థాలు తెచ్చి హైదరాబాద్లో తన స్నేహితులు, కస్టమర్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Tags:    

Similar News