గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ లో నేర తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దారుణమైన నేరాలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. కొన్ని నేరాల్ని చూసి పోలీసులు సైతం షాక్ తింటున్నారు. పోలీసుల సామర్థ్యానికి పరీక్ష మాదిరి కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా జరుగుతున్న నేరాల్ని చూస్తే.. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న భావన కలగటం ఖాయం.
తాజాగా అలాంటి ఉదంతమే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ ప్రశాంతి థియేటర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫేస్ బుక్ ప్రెండ్ పై అత్యాచారం జరగటం సంచలనంగా మారింది. నమ్మకంతో ఫేస్ బుక్ ఫ్రెండ్ భిక్షపతితో కలిసి సినిమాకు వెళ్లానని.. అయితే థియేటర్లో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా బాధిత మహిళ వెల్లడించింది.
వాస్తవానికి ఈ ఘటన జనవరి 29న జరగ్గా.. ఫిబ్రవరి 1న బయటకు వచ్చింది. బాధిత మహిళ పోలీసుల్ని సంప్రదించిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్యాబ్ డ్రైవర్ భిక్షపతిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.