మామూలుగా సంక్రాంతి.. దసరా పండగలు వచ్చినపుడు మాత్రమే హైదరాబాద్ నుంచి ఆంధప్రదేశ్ జనాలు పెద్ద ఎత్తున ఊర్లకు వెళ్తుంటారు. అప్పుడు సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంటుంది. కానీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగానూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో లక్షల మంది హైదరాబాద్ నుంచి తమ ఊర్లకు బయల్లేరుతున్నారు. ఎన్నికల సెలవుకు వేరే సెలవులు కూడా కలిసొస్తుండటంతో ఈ నాలుగు రోజులూ అందరూ ఊరి బాట పడుతున్నారు. బస్సులు , రైలు, విమాన టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. 300 కిలోమీటర్ల దూరం ఉన్న ఊర్లకు కూడా ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు రూ.2 వేల దాకా రేటు పెట్టి టికెట్లు అమ్ముతున్నారు. రైలు టికెట్లు కొన్ని నెలల కిందటే బుక్ అయిపోయాయి. బస్సుల్లోనూ ఇదే పరిస్థితి.
ఐతే ఇంత డిమాండ్ ఉండి, రేట్లు భారీగా ఉన్న సమయంలో కూడా చాలామంది ఏపీకి ఉచిత ప్రయాణాలు చేయగలుగుతున్నారు. ఇది కూడా ఎన్నికల మహత్యమే. ఏపీలో ఇప్పుడు ఓటు రేటు రూ.5 వేలకు తక్కువ కాకుండా పలుకుతోంది. ప్రధాన పార్టీలు పోటీ పడి డబ్బులు పంచుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చేవాళ్లకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా వారి ప్రయాణ ఖర్చులు తామే చూసుకుంటున్నారు అభ్యర్థులు. వారి కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం లేదా అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసి పెట్టడం చేస్తున్నారు. ఆ రకంగా కూడా ఓటుకు రూ.5 వేలకు తక్కువ కాకుండా పలుకుతోంది. ఐతే అందరూ ఇలా చేస్తున్నారని చెప్పలేం. ఓటు వేయడం బాధ్యతగా భావించి సొంత ఖర్చులతో ఊర్లకు వచ్చే వాళ్లూ ఉన్నారు. కానీ అవకాశం, ఆశ ఉన్న వాళ్లు మాత్రం ఈ సందర్భాన్ని బాగా ఉపయోగించుకున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నిన్న రాత్రి నుంచి పంపకాలు మొదలయ్యాయి. పార్టీలు పోటీ పడి డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. కొందరు డబ్బు బదులు చీరలు, సెల్ ఫోన్లు పంచుతున్నారు.