వుయ్​ మిస్​ యూ రక్షిత..బ్రెయిన్​ డెడ్​ అయిన అమ్మాయి..అవయవాలు దానం..!

Update: 2021-01-04 00:30 GMT
తెలంగాణకు చెందిన రక్షిత ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్​ డెడ్ ​కు గురైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా యువతి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తమ కూతురు తమ మధ్య లేకపోయినా.. ఆమె వల్ల నలుగురికి ఉపయోగం కలుగుతుందంటే అదే తమకు సంతోషమని వాళ్లు అంటున్నారు. రక్షిత అనే యువతి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్​ డెడ్​ అయిన విషయం తెలిసిందే.

రక్షిత స్వస్థలం నాగర్ ​కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి. ఆమె తండ్రి మల్లెపల్లి వెంకట్​ రెడ్డి మాజీ సైనికోద్యోగి. డీఆర్‌ డీఎల్‌ లోని బ్రహ్మోస్‌ ప్రాజెక్ట్‌ లో ఆయన డ్రైవర్‌ గా చేసేవారు. అయితే రంగారెడ్డి జిల్లా బడంగ్‌ పేట కేశవరెడ్డినగర్‌ కాలనీలో ఆయన కుటుంబం స్థిరపడింది. వెంకట్​ రెడ్డి కూతురు రక్షిత ఎంఎస్​ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. గత నెల 31న సిడ్నీలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రక్షిత డివైడర్‌ ను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమైంది.

అయితే అక్కడి పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రక్షితకు  బ్రెయిన్‌ డెడ్‌ కు అయినట్టు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అయితే ఆమె అవయవాలను దానం చేస్తే మరికొందరికి ప్రాణం పోయవచ్చని అక్కడి వైద్యులు రక్షిత తల్లిదండ్రులను కోరారు. దీనికి వారు అంగీకరించారు.అయితే మృతదేహం రావడానికి మరో వారం పడుతుందని రక్షిత తండ్రి చెప్పారు. రక్షిత మృతదేహానికి ఇండియాకు తీసుకొచ్చేందుకు అక్కడి తెలుగుసంఘాలు కృషిచేస్తున్నాయి.
Tags:    

Similar News