బీజేపీ నేత రఘునందన్ రావు పై లైంగిక వేధింపుల కేసు...!

Update: 2020-02-03 12:37 GMT
తెలంగాణ బీజేపీ నేతపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. సిద్ధి పేట జిల్లాకు చెందిన బీజేపీ నేత రఘునందన్ రావుపై రాధారమణి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్న  ఆయన తనపై లైంగిక దాడి చేశారంటూ సైబరాబద్ సీపీ సజ్జనార్‌ను కలిసింది. ఇవాళ సీపీని కలిసిన ఆమె ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రఘునందన్‌ రావుపై హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేసినట్లుగా ఆమె తెలిపింది.

కాగా, కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. తరచూ టీవీ చర్చల్లో పాల్గొనే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

ఇకపోతే , 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ముందుగా టీఆర్ ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2001 ఏప్రిల్ 27 నుంచి 2013 వరకు ఆయన టీఆర్ ఎస్ లోనే కొనసాగారు.అయితే 2013 మే 14న రఘునందన్ నావుకు టీఆర్ ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇక తాజాగా  2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
Tags:    

Similar News