ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడి మృతి..

Update: 2022-03-11 08:30 GMT
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం చెందాడు.  25 ఏళ్ల హైదరాబాద్ వ్యక్తి తన డ్రీమ్ నెరవేర్చుకున్న రెండు నెలలకే మృత్యువాతపడ్డాడు. ఉద్యోగం సంపాదించిన రెండు నెలలకే ఆస్ట్రేలియాలో మరణించాడు. ఇతడిని సాయి సూర్య తేజ్‌గా గుర్తించారు . 2020లో గోల్డ్ కోస్ట్‌లో విషాదం సంభవించినప్పుడు నాటి ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా మరోసారి అతడిని మృత్యువు కబళించింది.

గోల్డ్ కోస్ట్‌లోని కాండోర్ ఓషన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని రిసార్ట్ పూల్‌లోకి దురదృష్టవశాత్తూ   డైవింగ్ చేసిన తర్వాత సూర్యతేజ్ ఈరోజు మరణించాడు. సాయి సూర్య తేజ్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందాడు. "సరదాగా ఉంటాడని.. సంతోషంగా ఉంటాడని చెబుతున్నారు.. మృతుడి కుటుంబం సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో నివసిస్తోంది.

వివరాల్లోకి వస్తే సూర్య తేజ్ 2019లో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. అతనిని కోల్పోయిన తల్లిదండ్రులు రాచకొండ శ్రీనివాస్-అమృత స్పందించారు. 2020లో సూర్యతేజ్ ప్రమాదానికి గురైన విషాద సంఘటనను గుర్తు చేసుకున్నారు. చాలా చికిత్సలు.. శస్త్రచికిత్స తర్వాత సూర్య తేజ్‌కు వచ్చే నెల ఏప్రిల్‌లో రెండో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

సూర్యతేజ్ తల్లిదండ్రులు అతని గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి ఆస్ట్రేలియాకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులకు.. స్నేహితులకు అతడి మరణం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాడు, తేజ్ బ్రిస్బేన్ -గోల్డ్ కోస్ట్ స్విమ్మింగ్ పూల్ వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. వైద్య సిబ్బంది పరీక్షించి చనిపోయినట్లు ప్రకటించారు. కాపాడడానికి సుమారు ఒక గంట ప్రయత్నించారు.. కానీ విజయవంతం కాలేదు.

ప్రస్తుతం సూర్యతేజ్ మృతదేహం  కోసం తల్లిదండ్రుల ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి స్వదేశానికి పంపే ప్రక్రియ జరుగుతోంది. అతని రాకతో భారతదేశంలో దహన సంస్కారాలు.. వేడుకలు షెడ్యూల్ చేయబడ్డాయి.

అలాగే, అతని స్నేహితులు అంత్యక్రియలు నిర్వహించడానికి.. అతని తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించే నిధులను సేకరిస్తున్నారు
Tags:    

Similar News