అప్పులు బాగా చేస్తున్న హైదరాబాద్ కుర్రాళ్లు

Update: 2020-01-21 04:46 GMT
ఐటీ సిటీ బెంగళూరు వాసులు దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసే వారని నిన్న బ్రేకింగ్ విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. సాఫ్ట్ వేర్ కొలువులతో లక్షల జీతం.. పరిశ్రమ - వ్యాపార రంగాల్లో రాణిస్తున్న బెంగళూరు వాసులు అత్యధికంగా హోమ్ - పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారని తెలిసింది.

మరి నంబర్ 1 అప్పులోల్లు బెంగళూరోళ్లు అయితే నంబర్ 2 ఎవరి అనుకుంటున్నారా? అది మనమే.. ఘనత వహించిన హైదరాబాదీలే దేశంలో నంబర్ 2 అప్పులోల్లుగా నిలిచారు.

అవును.. మన హైదరాబాద్ వాసులు దేశంలోనే నంబర్ 2 రుణ గ్రహీతలు అని తాజాగా వృత్తి నిపుణులకు రుణాలిచ్చే ‘క్యాష్ ఈ’ అనే సంస్థ నివేదికలో బయటపెట్టింది. 4లక్షల వినియోగదారుల రుణ దరఖాస్తులను అధ్యయనం చేసి ఈ విషయాన్ని బయటపెట్టింది. రుణాలు ఎక్కువగా తీసుకుంటున్న జాబితాలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ నిలిచింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ - ఫుణె - ముంబై - చెన్నై - జయపుర - అహ్మదాబాద్ లు ఉన్నాయని సంస్థ నివేదిక వెల్లడించింది.

ప్రధానంగా ఈ రుణాలను యువత వైద్య ఖర్చులు - ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు వాడుతోందని సంస్థ నివేదిక తెలిపింది. 5లక్షల వార్షిక వేతనంలోపు ఉన్న వారు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారని.. 31-38 మధ్యనున్న వయసు వారే 52 శాతం రుణాలు తీసుకున్నారని సంస్థ తెలిపింది.
Tags:    

Similar News