భారత దేశంలోని రోడ్లపై సరి కొత్త కార్లు తిరగనున్నాయి. ఇప్పటి వరకు శిలాజ ఇంధనం తో నడిచిన కార్లు ఇకపై హైడ్రోజన్ తో తిరగనున్నాయి. ఈ కార్ల కు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనం అవసరం లేదు. కనీసం కరెంట్ కూడా లేకుండా కేవలం హైడ్రోజన్ తో మాత్రమే ఈ కార్లు మన దేశ రోడ్ల మీద త్వరలోనే చక్కర్లు కొట్టనున్నట్లు తెలుస్తోంది. వీటి వల్ల పర్యావరణం కూడా దెబ్బ తినకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా కేవలం హైడ్రోజన్ తోనే కార్లు నడపడం కుదురుతుందా అంటే కచ్చితంగా అవును అనే సమాధానం మనకు వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన కార్ల ఉత్పత్తి కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేగాకుండా ఈ కార్లు మన రోడ్లపై పరుగులు పెట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే హైడ్రోజన్ తో నడిచే కారు ని టయోటా సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
ఈ సంస్థ తయారు చేసిన మిరాయ్ అనే ఓ కారును భారత రోడ్లపై పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ఉండే వాతావరణానికి సరిపడుతాయాల లేక ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా అనే దానిపై కూడా సమాలోచనలు చేస్తుంది సంస్థ. దీనికి సంబంధించిన టెస్ట్ రన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు ను ఈ రోజు శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ కార్ల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేటు లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీలు కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే ఈ కార్లు భారత రోడ్లపై చక్కర్లు కొట్టాలంటే మరి కొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.
పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి వస్తే.. గాలిలో ఉండే హైడ్రోజన్ వాడకం భారీగా పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో పర్యావరణ కాలుష్యం కూడా బాగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. దీనికి తోడు ఈ కార్ల వాడకం తో భారీగా పెరిగిపోతున్న ఇంధన ధరలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు.
అయితే ఈ వాహనాలకు కూడా సాధారణ వాహనాలుకు ఇంధనం నింపినట్లుగా ఫిల్ చేస్తాము. అయితే దీనిలో ఇతర ఇంధనాలకు బదులుగా హైడ్రోజన్ పడతారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు భారత్ తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దీనిని దిల్లీలో ప్రారంభించారు. అయితే మన రోడ్లపై, ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అది తట్టుకుంటుందా లేదా అనే దానిపై అధ్యయనాలు చేస్తున్నారు. టయోటా కు చెందిన మిరాయ్ కారు మైలేజ్ పరంగా కూడా మంచి ప్రతిభ కనబరుస్తుంది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1,359 కిమీ మేర ప్రయాణం చేసింది. ఇంత దూరం ప్రయాణం చేయడంతో ఇది గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.