మన డ్రగ్ తో ప్రాణాలు నిలిచాయా? పోయాయా?

Update: 2020-04-23 00:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల క్రితం పట్టుబట్టి భారత్ మెడలు వంచి మరీ మన డ్రగ్ హైడ్రాక్సి క్లోర్లోక్విన్ మందును అమెరికాకు తీసుకుపోయారు. ఈ మలేరియా నివారణ మందు కరోనాపై బాగా పనిచేస్తుందని రుజువైందని తెలిపారు.

అయితే ఈ ఔషధం వాడిన వెంటిలేటర్ పై ఉన్న రోగులకు అంతగా పనిచేయలేదని.. మరణాల సంఖ్య ను ఆపలేదని తాజా అధ్యయనం తేల్చింది. ఈ మేరకు అమెరికా వెటరన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వైద్య కేంద్రాలు, వందలాది మంది రోగులపై చేసిన అధ్యయనం స్పష్టం చేసింది..

దాదాపు 368మంది రోగులలో హైడ్రాక్సిక్లోర్లోక్విన్ మందును 97మందికి ఇవ్వగా అందులో 27.8శాతం మంది చనిపోయారు. ఇక ఈ డ్రగ్ ను ఇవ్వని 158మంది రోగుల్లో కేవలం 11.4శాతం మంది మాత్రమే మరణించారని తెలిసింది. దీంతో మన డ్రగ్ కరోనా మరణాలను ఆపడం లేదని తేలింది.

ఇక ఫ్రెంచ్ అధ్యయనం కూడా కరోనా వైరస్ రోగులకు హైడ్రాక్సి క్లోర్లోక్విన్ ఔషధం సహాయపడడం లేదని తేల్చారు.

మలేరియా, లూపస్ , రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు ఉపయోగించే ఈ ఔషధాన్ని ట్రంప్ కరోనావైరస్ కు ఒక అద్భుత ఔషధంగా అభివర్ణించినప్పటికీ, డబ్ల్యూహెచ్‌ఓ దీనిని ఆమోదించలేదు. కరోనాపై దీని ఫలితాలు అంత బాగా రావడం లేదని తేలింది.
Tags:    

Similar News