కరోనా ట్రీట్మెంట్ కి ‘హైడ్రాక్సీ’ పనికి రాదు..ఆలోచిస్తామన్న ట్రంప్!

Update: 2020-04-23 08:10 GMT
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ... ఆ తరువాత ప్రపంచంలోని మెజారిటీ దేశాలకి వ్యాప్తి చెందింది. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి  దెబ్బకి  అమెరికా అతలాకుతలం అవుతుంది. ప్రతి రోజు అక్కడ వేల సంఖ్యల్లో కరోనా భాదితులు బయటపడుతున్నారు. అలాగే అత్యధిక కరోనా మరణాలు అమెరికాలో సంభవిస్తున్నాయి. ఇకపోతే , ఈ వ్యాధి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఇప్పటివరకు ఈ కరోనా సరైన వ్యాక్సిన్ లేదు. దీనితో ఈ వ్యాధి వ్యాప్తి వేగంగా పెరుగుతుంది.

ఇకపోతే , ఈ కరోనాకి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ..ఇప్పటి వరకు మలేరియా వ్యాక్సిన్ అయిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే , కరోనా చికిత్సకు మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనికొస్తుందంటూ ఇన్ని రోజులు చెప్తూ వచ్చిన  అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చారు.  కరోనా వైరస్ రోగులకు ఆ ఔషధాన్ని ఇచ్చే అంశాన్ని పునరాలోచిస్తామని - దాని పై త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని ట్రంప్ స్పష్టంచేశారు.

అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్  368 మంది కరోనా రోగులపై జరిపిన అధ్యయన నివేదికపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ట్రంప్‌ పైవిధంగా బదులిచ్చారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ - అజిత్రో మైసిన్ ‌లను కలిపి లేదా విడివిడిగా అందించినా కరోనా రోగులకు మెకానికల్‌ వెంటిలేషన్‌ ముప్పు ఎంతమాత్రం తగ్గడం లేదనేది ఎన్‌ ఐహెచ్‌ నివేదిక సారాంశం. ఆ ఔషధాలు వాడిన చాలామంది రోగులు మృత్యువాత పడ్డారని కూడా నివేదికలో ప్రస్తావించడం గమనార్హం. దీనితో ట్రంప్ కరోనా చికిత్సకి మలేరియా మందు పనికిరాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇకపోతే ఇప్పటి వరకు అమెరికాలో కరోనా భాదితుల సంఖ్య .. 849,092 కి చేరుకోగా ..47,681 మంది కరోనా కారణంగా  మృతి చెందారు.
Tags:    

Similar News