ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ చురుకుగా రాజకీయాలు చేస్తూ దూసుకెళ్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ వెంట యువత ఎక్కువగా నడుస్తున్నారు. అలాగే కాపు సామాజికవర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాలలో కూడా మెజారిటీ ప్రజలు జనసేన పార్టీ వెంట ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు, దర్శకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జనసేనకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేసిన కరెక్ట్ గా చేస్తారని బలంగా నమ్ముతారు.
పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చిన వారు అతనితో ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడతారు. అలా పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసిన కమెడియన్స్ కూడా ఉన్నారు. శకలక శంకర్ గత ఎన్నికలలో జనసేన పార్టీ తరపున శ్రీకాకుళంలో చాలా ప్రచారం నిర్వహించారు. తరువాత సినిమాలలో బిజీ అయ్యారు.
అయితే వచ్చే ఎన్నికలలో కూడా శకలక శంకర్ జనసేన పార్టీ కోసం ప్రచారం చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయ్యి ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్ గా రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హైపర్ ఆది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి అతనికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు.
చాలా సందర్భాలలో జనసేన పార్టీ తరపున నిర్వహించే సభలలో పాల్గొని పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడారు. అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. గత ఎన్నికలలో కూడా ఉభయగోదావరి జిల్లాలలో జనసేన తరుపున ప్రచారం చేశారు. ఇప్పుడుహైపర్ ఆది పాపులారిటీ మరింత పెరిగింది.
ఈ నేపధ్యంలో తాజాగా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ భావజాలం గురించి గొప్పగా చెప్పడంతో పాటు ప్రత్యర్ధులు ఆయనపై చేసే విమర్శలకి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. హైపర్ ఆది స్పీచ్ యువశక్తి సభలో హైలైట్ కావడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. మంత్రులపై హైపర్ ఆది ఘాటుగా విమర్శలు చేశారు. దీనిపై అధికార పార్టీ సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. అయితే హైపర్ ఆది ఈ స్థాయిలో ఘాటుగా అధికార పార్టీపైవిమర్శలు చేయడం వెనుక వేరొక కారణం ఉందనే మాట వినిపిస్తుంది.
రానున్న ఎన్నికలలో ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు లేదంటే దర్శి నియోజకవర్గాల నుంచి అతనిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబెట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే హైపర్ ఆది నేరుగా పవన్ కళ్యాణ్ ముందే తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు చేసి అందరి అటెన్సన్ గ్రాప్ చేసాడనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.