హ్యుందాయ్ కొత్త ఎల‌క్ట్రిక్ ఎస్‌ యూవీ కారు రిలీజ్

Update: 2019-07-09 12:42 GMT
పెట్ర‌లో.. డీజిల్ కార్ల‌కు చెక్ చెబుతూ.. ఎల‌క్ట్రిక్ కార్లు వ‌చ్చేసి చాలాకాల‌మే అయ్యింది. అయితే.. ఆ కార్ల‌లో వ‌స‌తులు త‌క్కువే. దీంతో సంప్ర‌దాయ కార్ల‌ను వీడే విష‌యంలో చాలామంది ఇష్ట‌ప‌డ‌లేదు.  ఇలాంటివేళ‌లో త‌ర్వాతి త‌రం కార్లుగా చెబుతున్న ఎల‌క్ట్రిక్ కార్ల‌కు సంబంధించి ప్ర‌ఖ్యాత కొరియ‌న్ కంపెనీ హ్యుందాయ్ తాజాగా త‌న కారును భార‌త మార్కెట్ లో తొలిసారిగా విడుద‌ల చేసింది.

సంప్ర‌దాయ ఇంధ‌నాల‌తో పోటీ ప‌డేలా ఫీచ‌ర్లు సిద్ధం చేసిన ఈ తొలి ఎల‌క్ట్రిక్ ఎస్ యూవీ  కారుకు కోన పేరును పెట్టింది. దీని ఎక్స్ షోరూం ధ‌ర‌ను రూ.25.30 ల‌క్ష‌లుగా డిసైడ్ చేశారు. ఇంటీరియ‌ర్.. ఫీచ‌ర్లు.. కారు లోప‌ల విశాల‌మైన స్థ‌లం ఇలాంటివ‌న్నీ చూసిన‌ప్పుడు ఇదే కంపెనీకి చెందిన క్రెటా కారును గుర్తుకు తెచ్చేలా ఉంద‌ని చెప్పాలి.

ప్ర‌పంచ వ్యాప్తంగా కోన ఎల‌క్ట్రిక్ కారును రెండు ర‌కాల బ్యాట‌రీ ఆప్ష‌న్లు ఇచ్చారు. 39.2 కిలోవాట్లు.. 64 కిలోవాట్లుతో ప‌ని చేస్తుంది. ఈ కారుకు అమ‌ర్చిన బ్యాట‌రీని ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే వీలుంది. పూర్తిస్థాయి ఛార్జింగ్ కు గంట వ్య‌వ‌ధి స‌రిపోతుంది. ఈ కారును కొనుగోలు చేసిన వారికి ఒక పోర్ట‌బుల్ ఛార్జ‌ర్ తో పాటు.. ఏసీ వాల్ బాక్స్ ఛార్జ‌ర్లు ఇస్తారు. దీన్ని టాప‌ప్ ఛార్జింగ్ చేస్తే 50కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే వీలుంది.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే.. మిగిలిన కార్ల‌తో పోలిస్తే అతి త‌క్కువ వ్య‌వ‌ధిలో 100 కిలోమీట‌ర్ల వేగానికి పుంజుకునేలా ఈ కారును సిద్ధం చేశారు. 0-100 కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌లం 9.7 సెక‌న్ల‌లో చేరుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక సాధార‌ణ ఎస్ యూవీ కంటే దీని వేగం చాలా ఎక్కువ‌గా చెప్పాలి. మొత్తం మూడు విభాగాల్లో ఈ కారును అమ్మ‌నున్నారు. కారు బ‌య‌టే కాదు.. లోప‌ల కూడా అత్యాధునికంగా సిద్ధం చేశారు.  ఈ కారుకు సంబంధించి ఉన్న ఏకైక చింత ఛార్జింగ్‌. దీనికి సంబంధించి హ్యుంద‌య్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ స‌హ‌కారంతో తొలిద‌శ‌లో ముంబ‌యి.. చెన్నై.. బెంగ‌ళూరు.. ఢిల్లీలో ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి అవ‌స‌ర‌మైన నిధుల్ని హ్యుంద‌య్ పెట్ట‌నుంది. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా కార్ల‌ను ఎల‌క్ట్రిక్ గా మార్చే అంశంలో తాజా కోన తొలి అడుగు వేసిన‌ట్లు అవుతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News