వైసీపీలో ఇపుడు అంతర్గత ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా వెల్లివిరుస్తోంది. పార్టీ పేరులో చివరాఖరున కాంగ్రెస్ పార్టీ ఉంది. మెజారిటీ నాయకులు అక్కడ నుంచి వచ్చిన వారే. అయితే ఇన్నాళ్ళు జగన్ అంటే భయం ఉండేది. కానీ అది కాస్తా ఇపుడు బద్ధలైపోయింది. మలి విడత మంత్రి వర్గ విస్తరణ సాక్షిగా ఎమ్మెల్యేల అసంతృప్తి తారస్థాయికి చేరిపోయింది.
ఎపుడూ మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడని నేతలు సైతం ఇపుడు బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అయితే తాను హింసా వాదిని అని గట్టిగా చెప్పుకున్నారు. తాను మెతక అనుకుంటే పొరపాటు అని కూడా చెప్పేశారు.
తాను మొదటి నుంచి హింసావాదిగానే ఉండేవాడిని అని ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక తగ్గానని, రాజకీయాల్లో మంచిగా ఉండాలని మృదువుగా వ్యవహరించానని గొల్ల బాబూరావు అంటున్నారు. అయితే అది తప్పు అని తేలుతోందని, దూకుడుగా ఉంటేనే కధ నడుస్తుందని గుర్తించినట్లుగా ఆయన అంటున్నారు.
మొత్తానికి గొల్ల బాబురావు దెబ్బకు దెబ్బ తీస్తాను అని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. మరి ఆయన చేస్తున్న ఈ హెచ్చరికలు ఎవరి మీద అనందే చర్చ. తాను బలమైన కాంగ్రెస్ ని ఎదిరించాను, జగన్ కి కొండంత అండగా నిలిచాను అని కూడా చెప్పుకున్నారు. తాను వైసీపీ ఫౌండర్ మెంబర్ అని క్లెయిం చేస్తున్న బాబూరావు తనకు తీరని అన్యాయం జరిగింది అని కూడా గుండెల్లో ఉన్న బాధను బయటపెట్టుకున్నారు.
ఇవన్నీ సరే కానీ మంత్రి పదవి దక్కలేదు అన్న బాధ బాబూరావులో ఉంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా పదవి వరించలేదు అన్న వ్యధ కూడా ఉంది. అయితే దానిని మించి ఆయన చేస్తున్న హాట్ హాట్ కామెంట్స్ ఇపుడు చర్చకు వస్తున్నాయి. హింసావాదిని అని ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవచ్చునా అన్నదే చర్చ.
ఇక హింసావాది ఏం చేస్తాడు అన్నది తెలిసిందే. మరి వయసులో అనుభవంలో పెద్ద అయిన సీనియర్ నేత బాబూరావు తాను హింసావాదిని అంటూ ప్రకటించుకోవడం ద్వారా ఎవరిని బెదిరిస్తున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. ఎమ్మెల్యే పదవి బాధ్యతతో కూడినది. నాయకుడు మాట్లాడితే క్యాడర్ ఆసక్తిగా వింటుంది. లక్షలాది మంది యువత కూడా స్పూర్తిగా తీసుకుంటారు.
మరి దెబ్బకు దెబ్బ అంటూ బాబూరావు చేస్తున్న కామెంట్స్ మీద కూడా పలు రకాలైన వాదనలు వస్తున్నాయి. ఆయనకు అన్యాయం జరిగింది అన్నది అందరి మాట. అయితే దానికి ఆయన రియాక్షనే ఇపుడు అంతకంటే పెద్ద చర్చగా ఉంది. మరి బాబూరావుకి సొంత పార్టీలో ప్రత్యర్ధులు ఉన్నారని క్యాడర్ చెబుతోంది.
బహుశా వారి గురించే ఆయన ఇలాంటి వార్నింగ్ ఇచ్చారా లేక హై కమాండ్ కి తన మంచితనమే ఇన్నాళ్ళూ చూశారు, ఇపుడు దూకుడును చూస్తారు అని హెచ్చరికలు పంపడమేనా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి గొల్ల బాబూరావు లో రెండవ కోణమిది. ఆయనను ఇప్పటిదాకా చూసిన వారు ఎరగని రూపమిది. మరి నిజంగా బాబూరావు అగ్రెస్సివ్ మోడ్ లోనే వెళ్తారా. చూడాలి.