రాజకీయాలే శ్వాసగా బతికేసే వారు.. రాజకీయాల్లో తాను లేనని చెప్పటానికి మించిన సంచలనం ఇంకేం ఉంటుంది.నరనరాన రాజకీయాల్ని నింపుకొని.. ఏ రోజుకైనా రాష్ట్రాన్ని ఏలాలని ఫీలయ్యే పెద్ద నేత ఒకరు.. తానిప్పుడు రాజకీయాల్లో లేనని చెప్పటం షాకింగ్ గా ఉంటుందనటంలో సందేహం లేదు. తాజాగా అలాంటి షాకే ఇచ్చారు తమిళనాడు రాష్ట్ర విపక్షనేత కుమారుడు అళగిరి.
తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి అళగిరి పరిచయమే ఉన్నా.. మరీ అంత సుపరిచితుడు మాత్రం కాదన్నది వాస్తవం. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడిగా.. మాజీ కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆళగిరి ఎలాంటి వాడన్న మాటను తమిళనాడులో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. లెక్కల్లో తేడా వస్తే.. తండ్రిని సైతం వణికించే తత్వం ఆయన సొంతంగా చెబుతారు.
హింసా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన్ను కొందరు విమర్శిస్తుంటారు. ఈ కారణం చేతనే.. ఆళగిరి పార్టీ బాధ్యతలు కట్టబెట్టేందుకు కరుణానిధి ఏమాత్రంఇష్టపడరని.. సరిగా నడవలేని స్థితిలో ఉండి కూడా తన తర్వాత తన వారసుడు ఎవరన్న విషయాన్ని ప్రకటించేందుకు నిన్న మొన్నటి వరకూ ఆలోచించటానికి.. తొందరపడి ప్రకటన చేయకపోవటానికి కారణం ఆళగిరిగా చెబుతుంటారు. ఆమధ్యన ఆయనపై కరుణ వేటు వేయటం తెలిసిందే.
ఈ మధ్యనే తన రాజకీయ వారసుడిగా తన చిన్నకొడుకు స్టాలిన్ ను కరుణ చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఆళగిరి ఆసక్తికరమైన మాటను చెప్పారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్న వేళ.. ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను మీడియా చుట్టిముట్టినప్పుడు.. తానిప్పుడు రాజకీయ నేతను ఎంతమాత్రం కాదని.. తన తండ్రిని పరామర్శించేందుకు మాత్రమే తాను వచ్చానని.. తాను రాజకీయాలకు దూరమై చాలా కాలమే అయ్యిందంటూ వ్యాఖ్యానించి అందరిని షాక్ కు గురి చేశారు.
తాను రాజకీయాల్లో లేనని.. అందుకే పాలిటిక్స్ క్వశ్చన్స్ తనను వేయొద్దని ఆయన మీడియాతో అనటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తండ్రి కరుణానిధి అస్వస్థతకు గురైన నాటి నుంచి తరచూ చెన్నై వచ్చి వెళుతూ.. ఆయన్ను పరామర్శిస్తున్నారు. తరచూ తండ్రిని కలుస్తున్న ఆళగిరి.. తిరిగి డీఎంకేలోకి వచ్చే అవకాశం ఉందన్న మాట ఇప్పడు పలువురి నోట వినిపిస్తోంది. చూస్తూ.. చూస్తూ సుడిగాలిని తీసుకొచ్చి పెద్దాయన ఉక్కిరిబిక్కిరి అవుతారా? అన్నది పెద్ద ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/