కొడుకు చేతికి వచ్చాడంటే ఏ తండ్రి అయినా సంతోషపడిపోతాడు. అందులోకి వేలాది కోట్ల రూపాయిల్ని పోగేసి మరీ.. కొడుక్కి కానుకగా ఇచ్చిన తండ్రికి షాకిస్తూ.. ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా చేసిన వైనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. రియల్ లైఫ్ లోనూ అలాంటి మామూలే అనే రీతిలో రేమాండ్స్ ఇంటి గుట్టు బయటకు పొక్కటం ఆ మధ్య సంచలనంగా మారింది.
దేశ వ్యాప్తంగా సుపరిచితమైన బ్రాండ్ గా.. వందలాది కోట్ల ఆస్తి పాస్తులున్న రేమాండ్స్ వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘానియా తాజా పరిస్థితి దారుణంగా ఉందని.. ఆయన చేతిలో డబ్బులు లేక కటకటలాడుతున్నారని.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. అద్దె ఇంట్లో బతుకుబండి నడిపిస్తున్నారన్న సంచలన విషయాల్ని సీనియర్ రేమాండ్స్ స్వయంగా చెప్పుకొచ్చారు.
రేమాండ్స్ కంపెనీ బాధ్యతల నుంచి రిటైర్ అయిన తర్వాత తన వాటాగా ఉన్న దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల విలువైన షేర్లను కొడుక్కి బహుమతిగా ఇచ్చిన తనకు.. పెద్ద షాకే ఇచ్చినట్లుగా విజయ్ పథ్ సింఘానియా ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు తన పట్ల అనుసరించిన వైఖరిపై కోర్టు మెట్లు ఎక్కిన ఆయన పుణ్యమా అని రేమాండ్స్ ఇంటి ఇష్యూపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ ఉదంతంపై విమర్శలు ఎదుర్కొంటున్న రేమాండ్స్ జూనియర్ తాజాగా ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తన చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం గమనార్హం. రేమాండ్స్ కు తానే చట్టబద్ధమైన వారసుడినని చెప్పుకున్న గౌతమ్ సింఘానియా.. తన తండ్రి తనకిచ్చిన వెయ్యి కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చి తప్పేం చేయలేదని సమర్థించుకున్నారు. తాను కూడా 35 ఏళ్లుగా కంపెనీలో పని చేశానని.. తనకు కాకుండా ఇంకెవరికీ ఆస్తులు అప్పగిస్తారని ప్రశ్నించారు.
ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత తన మీదే ఉందన్న గౌతమ్.. తనకు కాకుండా మరెవరికీ ఆస్తులు అప్పగించినా రేమాండ్స్ కుప్పకూలిపోతుందన్నారు. తన తీరును సమర్థించుకున్న గౌతమ్.. తన తండ్రి విషయంలో ఎందుకంత కఠినంగా వ్యవహరించారన్న విషయాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం.