మాస్ లీడర్, జనంలో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే నాని.. అనుకున్నట్టే మంత్రి అయ్యారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్న ఆయనకు జగన్ మంత్రి పదవి కేటాయించారు. గుడివాడ నుంచి నాలుగు సార్లు గెలిచిన ఆయన మంత్రిగా ఈరోజు ప్రమాణం చేశారు..
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రిపదవి ఇచ్చి జగన్ నమ్మారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని’ చెప్పుకొచ్చారు. 151మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నా తొలి నుంచి జగన్ తో ఉండడంతోపాటు సామాజికవర్గం కూడా కలిసి వచ్చి మంత్రి పదవి దక్కిందని నాని వివరించాడు. కానీ ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అనుకోలేదన్నారు. ఏ శాఖ ఇచ్చినా తాను జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
టీడీపీలో ఉన్నా తను మంత్రి అయ్యేవాడనని అందరూ అన్నారని.. కానీ మంత్రి కోసం తాను వైసీపీలో చేరలేదని నాని క్లారిటీ ఇచ్చారు. అభిమానాన్ని టీడీపీలో చంపుకోలేకే ఆ పార్టీని వదిలేశానన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడునని చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదని.. అందుకే అటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చానని నాని తెలిపారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారని.. జగన్ కు అండగా ఉండాలనే వైసీపీలో చేరానన్నారు. తాను మంత్రి అవ్వడం గుడివాడ కార్యకర్తలు, ప్రజలు ఇచ్చి గిఫ్ట్ అని.. సంతోషంగా ఉందని.. భయంతో పనిచేస్తానన్నారు. బరువు, బాధ్యత, ఒత్తిడితో ఈ మంత్రి పదవి చూస్తే భయం కలుగుతోందన్నారు. సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.