'బెదిరింపులకు భయపడేది లేదు..' అని అన్నాడట ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తనను కలవడానికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల ముందు చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరికి ఆ ప్రకటన అంటే.. ప్రభుత్వానికే అని అనుకోవాలి.
జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఈ విధంగా హెచ్చరిక చేసినట్టుగా సమాచారం. మరోవైపు చంద్రబాబు నాయుడు కు పరామర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఓడిపోయినదగ్గర నుంచి చంద్రబాబు నాయుడును అనేక మంది కార్యకర్తలు కలిసి ధైర్యం చెబుతూ ఉన్నట్టుగా ఆ పార్టీ ప్రకటించుకుంటూ ఉంది.
అందుకు సంబంధించి 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..' అంటూ ఒక సీరియల్ నడిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ మేరకు ఆ వ్యవహారం అలా కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడుకు అలా అనేక మంది కార్యకర్తలు ధైర్యం చెబుతూ ఉన్నట్టుగా ఆ పార్టీ ప్రకటించుకుంది. చంద్రబాబు ఓటమిని వారు అస్సలు నమ్మడం లేదని ఆ పార్టీ అంటోంది. అందుకే ఆ మేరకు వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట.
వారి ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..తాము అద్భుతంగా పాలించినట్టుగా, జగన్ కు అస్సలు పాలించడం రావడం లేదని వ్యాఖ్యానిస్తూ ఉన్నారని సమాచారం. తమను బెదిరించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని.. అయితే తాము బెదిరే ప్రసక్తి లేదని కూడా చంద్రబాబు నాయుడు తేల్చి చెబుతున్నట్టుగా సమాచారం!