మీరిచ్చే జీతం నాకొద్దు.. ఓ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నిర‌స‌న‌?

Update: 2022-04-20 08:39 GMT
సాధార‌ణంగా... ప్ర‌భుత్వం ఇచ్చే వేత‌నాల కోసం.. లేదా.. క‌ల్పించే సౌక‌ర్యాల కోసమే ఎవ‌రైనా.. ప‌నిచేస్తా రు. హోదా.. డ‌బ్బు... అధికారం.. ఈ మూడు.. ప్ర‌భుత్వ విభాగాల్లో ప‌నిచేసేవారికి అస‌లైన ల‌క్ష్యాలు. అలాంటి వారు జీతం వ‌ద్దంటే...ఏమ‌నుకోవాలి?  ''మీ జీతం నాకొద్దు.. మీరిచ్చే జీతంనేను తీసుకోను!'' అని మొహ‌మాటం లేకుండా.. చెబితే.. దీని వెను స్ఫూర్తి ఉంద‌ని అనుకోవాలా?  లేక‌.. నిర‌స‌న తెలుపుతున్నార‌ని..అనుకోవాలా? ఇదే ఇప్పుడు ఏపీ సీఎంజ‌గ‌న్‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి  తాజాగా సంచ‌ల న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇకపై  ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా విధులు నిర్వహించనున్న ట్లు వెల్లడించారు.

ఇకపై జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి తన వేతనం రూ.65 వేలు తీసుకోనంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదికి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి లేఖ రాశారు.  గతంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేగానూ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి  గెలిచి మెట్టు గోవింద్ రెడ్డి ప్రజా సేవ చేశారు.  

గత ఏడాది జూలైలో ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఆయన్ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి మెట్టుగోవింద రెడ్డి ఏపీఐఐసీ ఛైర్మన్ గా ప‌నిచేస్త‌.. నెల‌కు రూ.65 వేల వేత‌నంతోపాటు భ‌ద్ర‌త‌, వాహ‌నం.. ఇద్ద‌రు పీయేలు.. ఇంటి అద్దె.. ఇత‌ర‌త్రా అలవెన్సుల రూపంలో మొత్తంగా నెల‌కు రూ.300000 పొందుతున్నారు. అయితే.. స‌డెన్‌గా ఆయ‌న జీతం వ‌ద్ద‌ని ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణం.. ఏంటి? ఆయ‌న చెబుతున్న‌ట్టుగా.. ''పదవిని బాధ్యతగా మాత్రమే చూస్తానని అంతకుమించి వేరే స్వార్థం లేదంటూ'' ఉన్నా.. ఇన్నాళ్లు అంటే.. గ‌త జూలై నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జీతం ఎందుకు తీసుకున్నారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

ఈ నేప‌థ్యంలోనే మెట్టు గోవిందరెడ్డి నిర్ణయం పట్ల  అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చైర్మ‌న్‌గా ఉన్నా.. చాలా మందికి ప్రాధాన్యం లేకుండా పోయింది. వారికి.. అధికారుల‌కు మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. అంతేకాదు. ఎక్కడా వారికి విలువ కూడా లేకుండా పోయింది.

దీంతో చాలా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల లిడ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయితే.. బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు ప్రాధాన్యం లేద‌ని.. తాము ఒక్క ప‌నికూడా చేయ‌లేక పోతున్నామ‌ని.. వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మెట్టు తీసుకున్న నిర్ణ‌యం.. కూడా ఈ కోవ‌లోదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌పై.. ఇంకెలాంటి నిర్ణ‌యాలు చూడాల్సి వ‌స్తుందోన‌నే కామెంట్లు కూడా వ‌స్తున్నాయి.
Tags:    

Similar News