యూవీని ఆ ఇద్దరు ఎక్కువ ఇబ్బంది పెట్టారట

Update: 2019-06-14 01:30 GMT
టీం ఇండియా రెండు ప్రపంచ కప్‌ లు అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు యువరాజ్‌ సింగ్‌. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించిన యువరాజ్‌ తన అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. యూవీ మళ్లీ మునుపటి తరహాలో బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని ఆశించిన వారికి షాక్‌ ఇస్తూ యూవీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యూవీ ప్రకటించిన రిటైర్మెంట్‌ ఆయన అభిమానులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది.

రిటైర్మెంట్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన యూవీ తనను అంతర్జాతీయ క్రికెట్‌ లో ఇద్దరు బౌలర్లు ఎక్కువగా ఇబ్బంది పెట్టారంటూ చెప్పుకొచ్చాడు. అందులో మొదటి వ్యక్తి శ్రీలంక స్పిన్‌ బౌలర్‌ ముత్తయ్య మురళిధరన్‌ కాగా రెండవ బౌలర్‌ ఆస్ట్రేలియన్‌ ఫేస్‌ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌ గ్రాత్‌ అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరు వేసే బాల్స్‌ నన్ను ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టాయి. వారు వేస్తున్న బాల్స్‌ ను ఎదుర్కోలేక వదిలేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నాడు.

మురళిధరన్‌ వేసే బాల్స్‌ కు కొన్ని సార్లు నేను సమాధానం చెప్పలేక పోయేవాడిని. ఆయన దూస్రాలు ఎన్నో సార్లు నన్ను ఇబ్బంది పెట్టాయని యూవీ అన్నాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో తనకు అత్యంత ఇష్టమైన ఆటగాడు రికీ పాంటింగ్‌. అతడి ఆట తీరు నాకు ఎంతో నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. గత ఏడాదిలోనే రిటైర్మెంట్‌ ప్రకటించాలని భావించాను. కాని అప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ లో ఆడే విషయమై యూవీ క్లారిటీ ఇవ్వలేదు.
Tags:    

Similar News