బొంకరాబొంకరా బోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయలంత.. అన్నాడట. అలాగే ఉంది వల్లభనేని వంశీ మోహన్ తీరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి వంశీ మోహన్ చెప్పిన కబుర్లు విడ్డూరంగా ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే.. తనకు జగన్ తో పాతికేళ్లుగా పరిచయం ఉందని వంశీ మోహన్ చెప్పుకోవడం!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వయసుతో పోల్చి చూసినా వంశీ మోహన్ చెప్పిన మాట విడ్డూరంగా అనిపించక మానదు. వైఎస్ జగన్ కు ఇప్పుడు నలభై ఆరు-నలభై యేడేళ్లు ఉంటాయి. పాతికేళ్ల నుంచి పరిచయం అంటే..జగన్ కు ఇరవై రేండేళ్ల వయసు అప్పటి నుంచి వంశీ మోహన్ కు ఆయనతో పరిచయం ఉండాలి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే వైఎస్ తనయుడిగా గుర్తింపును పొంది ఉండవచ్చు. వైఎస్ కాంగ్రెస్ లో ఉన్నత పదవులు పొందిన నేత కావడంతో.. ఆయన తనయుడిగా అప్పటికి జగన్ కు గుర్తింపు ఉంది. అయితే అప్పటికి వంశీ మోహన్ ఎవరు? అంటే మాత్రం సమాధానం లేదు.
పాతికేళ్ల కిందట వంశీ మోహన్ రేంజ్ ఏంటి? అప్పటికి అతడి స్థాయి ఎంత? ఇక వంశీ మోహన్ ఏమీ రాయలసీమ ప్రాంతానికో, హైదరాబాద్ లో చదువుకున్న వ్యక్తో కాదు కూడా. అయినా వైఎస్ జగన్ తో తనకు పాతికేళ్ల పరిచయం ఉందంటూ.. ఒక కోత కోశాడు వంశీ. అది లాజికల్ గా లేకపోవడంతో ఆయనే ఇరకాటంలో పడుతూ ఉన్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నంలో వంశీ ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.