కర్ణాటక మాజీ సీఎం - జేడీఎస్ సీనియర్ నేత కుమారస్వామి... తనపై ఇటీవలి కాలంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తాను సీఎంగా ఉండగా... జంతకల్ మైనింగ్ వ్యవహారంలో కుమారస్వామి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా కాలం కిందటే నమోదైన కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఈ కేసును విచారిస్తున్న కోర్టు... కుమారస్వామిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనుందని, కుమారస్వామి అరెస్ట్ ఖాయమేనని గతం వారం వార్తలు వినిపించాయి.
అయితే ఎలాగోలా కుమారస్వామి అరెస్ట్ ముప్పును తప్పించుకున్నారు. ఈ క్రమంలో నిన్న బెంగళూరులో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి... తనపై వచ్చిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు. జంతకల్ మైనింగ్‌కు సంబంధించి తాను డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను ఆత్మహత్యకైనా సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కొందరు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల్లో తనను పలుచన చేయడానికి యత్నిస్తున్నారు. అయినా ఐ డోంట్ కేర్. నన్ను ఏమీ చేయలేర*ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయుడు రవి బెళగెరెను కావాలనే జైలుకు పంపించిన శాసనసభ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అనారోగ్య నిర్ణయాలు మంచివి కాదన్నారు. ఈ విషయంపై తాను స్పీకర్ కోళివాడను కలిసి వినతి పత్రం అందజేస్తానన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/