సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ అయినా పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమ నుంచి రాజకీయ మద్దతు పెద్దగా లేదనేది స్పష్టం అవుతున్న విషయమే. ఏపీ రాజకీయాలతో తెలుగు చిత్ర పరిశ్రమ అంటీ ముట్టనట్టుగా ఉంది. మరీ ఏ కొందరో తప్ప మిగతా వాళ్లంతా ఏపీ రాజకీయాల ను పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు.
ఈ పరిణామాల మధ్యన సినీ హీరో పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేన ద్వారా అమీతుమీ తేల్చుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కు ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరూ పెద్దగా సపోర్ట్ గా ప్రచారం కోసం రావడం లేదు. జనసేన తరఫున ఎన్నికల్లో పోటీకి దిగిన నాగబాబు తప్ప మెగా ఫ్యామిలీ మెంబర్లు ఎవరూ పవన్ కోసం, పవన్ పార్టీ కోసం ప్రచారం జోలికి వెళ్లడం లేదు.
వాళ్లే కాదు ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ కు సన్నిహితులు అయిన నటులు కూడా రాజకీయంగా పవన్ వెంట నడవడం లేదు. అందుకు ఒక ఉదాహరణ నటుడు అలీ.పవన్ సినిమాల్లో తప్పని సరిగా ఉండే అలీ పవన్ రాజకీయంలో మాత్రం వెంట లేరు!
ఈ పరిణామాల మధ్య పవన్ భక్తులకు కొంత ఊరటను ఇస్తున్నాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ‘పవన్ కల్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..’అంటూ బండ్ల ట్వీట్ చేశారు. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇచ్చే అంశం అవుతోంది.తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ అప్పుడు కూడా తనకు పవన్ అంటే అభిమానమే అన్నాడు. అయితే రాజకీయంగా తను కాంగ్రెస్ అని అప్పుడు బండ్ల స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల వేళ పవన్ పై బండ్ల గణేష్ ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు.
''నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు....
నా దైవం, నా బాస్..
పవన్ కల్యాణ్ గారిని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి....
మీ
బండ్ల గణేష్'' అంటూ ఈ పవన్ భక్తుడు ట్వీట్ చేశారు!