ఆమెకు వడ్డాణం చేయిస్తే నేను ఎప్పుడో మంత్రి అయ్యేవాడిని: ఎర్రబెల్లి

Update: 2022-08-20 06:26 GMT
ఎర్రబెల్లి సుధీర్ఘ నిరీక్షణకు తెరదించి సీఎం కేసీఆర్ ఆయనను ఈ దఫా మంత్రిని చేశారు. తెలుగుదేశంలో వెలుగు వెలిగిన ఎర్రబెల్లిని నాడు ఎన్టీఆర్ కానీ.. ఆ తర్వాత చంద్రబాబు కానీ పట్టించుకోలేదు. మంత్రి పదవిని ఇవ్వలేదు. కానీ ఎర్రబెల్లి మొరను కేసీఆర్ ఆలకించి మంత్రిని చేశారు. అయితే తాను గతంలో ఎందుకు మంత్రి కాలేదన్న విషయాన్ని ఎర్రబెల్లి బయటపెట్టారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ సమక్షంలో ఎర్రబెల్లి పలు సంచలన విషయాలను బయటపెట్టారు.

సుధీర్ఘ రాజకీయ జీవితం ఉన్నా కూడా ఎర్రబెల్లికి తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి దక్కలేదు. ఏళ్లు గడుస్తున్నా.. టీడీపీలో ఉన్నా.. ఎదురుగాలిలోనూ గెలిచినా.. ఆయన్ని మంత్రి పదవి వరించలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి పదవి ఇచ్చింది. ఆయన చిరకాల కోరిక నెరవేరింది. ఇక ఈ రాజకీయాలకు ఇది చాలు హ్యాపీ అంటూ ఎర్రబెల్లి చెప్పుకొచ్చాడు.

నీకు మంత్రి పదవి ఇప్పిస్తా.. నాకు వడ్డాణం కొనియ్యాలె అని లక్ష్మీపార్వతి అడిగిందని ఎర్రబెల్లి సంచలన విషయాన్ని లీక్ చేశారు. నీకు దండం పెడుతా.. అలాంటివి కొనియ్య అని చెప్పిన అని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.  ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి వివాహాన్ని తాను వ్యతిరేకించానని.. కానీ నన్ను పిలిచి నా చేతనే దండులు మార్చుకున్నారని ఎర్రబెల్లి పాత సంగతులు గుర్తు చేసుకున్నాడు. కేసీఆర్ చెబితే వినడన్నది తప్పు అని.. ఆయన చెప్తే వింటాడు అని బదులిచ్చాడు.

ఇక కొండా సురేఖ తనను ఫ్యాక్షనిస్టు అన్నదని.. అయినా ఆమె భర్త మురళీని చంపేందుకు ప్రయత్నిస్తే నేను కాపాడినానమ్మా అని దయాకర్ రావు వ్యాఖ్యానించారు. అయినా తనపై సినిమా తీశారని.. విలన్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని.. ఆ సినిమా రెండు రోజులే ఆడిందని చెప్పుకొచ్చాడు.

40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. కేంద్రంలోని మోడీ సర్కార్ లాంటి ఇంతటి కక్ష సాధింపు చర్యలు ఎన్నడూ చూడలేదని దయాకర్ రావు అన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరికించింది ఎర్రబెల్లియేనని.. ఆ ఉప్పందించింది మీరేనట అని ఏబీఎన్ ఆర్కే సూటిగా ప్రశ్నించారు. దీనికి ఎర్రబెల్లి ఏదో సమాధానమిచ్చాడు. అదేంటన్నది హైడ్ చేశారు. అదేంటో తెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేగడం ఖాయం. ఈ ఆదివారం ఈ షో ఎపిసోడ్ పుల్ ప్రసారం అవుతుంది. అప్పటివరకూ వేచిచూడాలి.


Full View

Tags:    

Similar News