మ‌రో మిగ్ కూలింది!... కుట్రా? - ప్ర‌మాదామా?

Update: 2019-03-08 16:59 GMT
పుల్వామా ఉగ్ర‌వాద దాడి నేప‌థ్యంలో భార‌త్ - పాకిస్థాన్‌ ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. పుల్వామా దాడికి ప్ర‌తీకారంగా భార‌త వాయుసేన పాక్ భూభాగంలోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై ముప్పేట దాడి చేసింది. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2 పేరిట భారత్ జ‌రిపిన ఈ దాడిలో మిగ్ యుద్ధ విమానాలు పాక్ వెన్ను విరిచాయి. అప్ప‌టిదాకా మిగ్ విమానాంలే పెద్ద‌గా పేరు లేకున్నా... స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2 దాడుల నేప‌థ్యంలో మిగ్ పేరు వైర‌ల్‌ గా మారింది. అయితే ఈ దాడుల త‌ర్వాత మిగ్ విమానాల కూల‌డం కూడా వైర‌ల్‌ గానే మారిపోయింది. గ‌తంలోనూ ప‌లు మిగ్ ఫైట‌ర్ జెట్లు కూలిపోయినా... పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. అయితే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2 దాడుల తర్వాత ఎక్క‌డ మిగ్ కూలినా ఆ వార్త‌లు వైర‌ల్‌ గా మారిపోతున్నాయి. ఈ త‌ర‌హా ఘ‌ట‌నే ఇప్పుడు మ‌రొక‌టి చోటుచేసుకుంది.

రాజస్తాన్‌ లో భారత యుద్ధ విమానం మిగ్‌-21 కుప్పకూలింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పైలట్‌ విమానం నుంచి ఎజెక్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్‌ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభా సర్‌కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్‌ ఎస్పీ తెలిపారు. ముందు చెప్పుకున్న‌ట్లుగా  పుల్వామా ఉగ్రదాడి - స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2 దాడుల నేపథ్యంలో మిగ్ కూలిపోవడంతో అలజడి రేగింది. అయితే రాజస్తాన్‌ లోని నాల్‌ ఎయిర్‌ బేస్‌ కు మిగ్‌-21ను ఐఏఎఫ్‌ తరలిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని స‌మాచారం. అయితే ఈ ఘ‌ట‌న వెనుక పాక్ కుట్ర ఉందా?  లేక అధికారులు చెబుతున్న‌ట్లుగా ఇది ప్ర‌మాద‌మేనా? అన్న‌దానిపై క్లారిటీ రాలేదు.
Tags:    

Similar News