పాక్ ఆర్మీకి చిక్కిన భారత ఏయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు భారత్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఆయన రాక కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అభినందన్ ను విడుదల చేయడానికి పాక్ ఒప్పుకుంది. ఆయనను శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద అప్పగిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించడంలో భారత్ ఊపిరి పీల్చుకుంది.
జెనీవా ఒప్పందమే అభినందన్‌ను కాపాడేలా చేసింది. ఈ ఒప్పందం ప్రకారం సైనికులు పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేయకకుండా సొంత దేశానికి పంపించాలి. మొదటి జెనీవా ఒప్పందం 1886లో జరిగింది. 1929లో కొన్ని సవరణలు చేసి రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1949లో దీనికి తుదిరూపాన్నిచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఈ మార్గదర్శకాలను రూపొందించింది.
ఇక అభినందన్ రాక సందర్భంగా ఆయన తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ వర్ధమాన్, శోభా వర్ధమాన్ చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అభినందన్ చూపిన ధైర్య సాహాసాలకు తాము ఎంతో గర్వపడుతున్నామన్నారు. ఆయన తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టులోకి రాగానే ప్రయాణికులు చప్పట్లతో స్వాగతం పలికారు. వారితో ఫొటోలు తీయించుకోవడానికి ఎగబడ్డారు.
మధ్యాహ్నం 12 గంటల తరువాత అభినందన్‌ని రావల్పిండి నుంచి లాహోర్‌కు తీసుకువస్తారు. జెనీవా ఒప్పందం మేరకు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి ఆయనను అప్పగిస్తారు. రోడ్డు మార్గం ద్వారా వాఘా వద్దకు చేరుకొని భారత ఏయిర్‌ఫోర్స్ అధికారులకు ఆయనను అప్పగిస్తారు. ఇదిలా ఉండగా అభినందన్‌ను రిసీవ్ చేసుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ రెడీ అయ్యారు. ఈ మేరకు భారత ప్రధానికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారు.